NTV Telugu Site icon

Satya Prasad: అధికారం లేక పిచ్చి పట్టినట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు..

Anagani

Anagani

Satya Prasad: అధికారం లేక పిచ్చి పట్టినట్లుగా మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహరిస్తున్నారు.. అందుకే అప్పుడే ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు అని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. గత అరాచక ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రజాస్వామ్య ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు ఖచ్చితంగా గమనిస్తున్నారు. నాసిరకం మద్యం తాగించి వేల మంది ఆడపడుచుల తాళిబోట్లు తెంచిన జగన్ రెడ్డి.. మద్య నియంత్రణపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు. వైఎస్ జగన్ రెడి తానిచ్చిన హామీల్లో కేవలం 12 శాతం మాత్రమే అమలు చేశారు.. బడుగు బలహీన వర్గాల ప్రజలకు చెందిన 150 పథకాలను రద్దు చేశారు అని మంత్రి అనగాని సత్య ప్రసాద్ వెల్లడించారు.

Read Also: Mexican: మెక్సికో సైనికుల కాల్పులు.. భారతీయుడి సహా ఆరుగురు వలసదారుల మృతి

ఇక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే ఐదు హామీలను నేరవేర్చింది అని మంత్రి అనగాని సత్య ప్రసాద్ చెప్పుకొచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 13 లక్షల కోట్ల రూపాయల అప్పులను ఇచ్చినా.. వీలైనంత త్వరగా ఇచ్చిన వాగ్ధాలన్నింటీనీ అమలు చేస్తాం అన్నారు. పెన్షన్ ను నాలుగు వేలకు పెంచడంతో పాటు ఒకటో తేదీనే ఇస్తుండడంతో అవ్వ తాతలందరూ చంద్రబాబే తమ పెద్ద కొడుకనే ఆనందంలో ఉన్నారు అని మంత్రి అనగాని చెప్పుకొచ్చారు.

Show comments