NTV Telugu Site icon

Ambati Rambabu: బాబు వెళ్లమంటేనే వారాహి బ్యాచ్ ఢిల్లీ టూర్‌.. బీజేపీతో విడాకులా..? టీడీపీతోనా..?

Ambati Rambabu 2

Ambati Rambabu 2

Ambati Rambabu: ఈ మధ్యే హస్తినలో పర్యటించారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ అయితే, వారి పర్యటనపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.. వారాహి బ్యాచ్ ఢిల్లీ టూర్‌కు వెళ్లింది అని ఎద్దేవా చేశారు.. చంద్రబాబు వెళ్లమంటే వారు వెళ్లారని అందరికీ తెలుసన్న ఆయన.. బీజేపీతో విడాకులు తీసుకోవటానికి వెళ్లాడా? లేక టీడీపీతో విడాకులు తీసుకుంటానని చెప్పడానికి వెళ్లాడా? అని ప్రశ్నించారు.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటానికి పవన్‌ కల్యాణ్‌ ఒక రాజకీయ పార్టీ పెట్టాడు అని మండిపడ్డారు.. పవన్‌కు కావాల్సిన ప్యాకేజి చంద్రబాబు దగ్గర ఉంది.. చంద్రబాబు పల్లకి మోసే వ్యూహాన్ని నాదెండ్ల మనోహర్ అమలు చేస్తున్నారు అంటూ ఫైర్‌ అయ్యారు.. అసలు, 175 సీట్లులో పోటీ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా? అంటూ సవాల్‌ విసిరారు మంత్రి అంబటి రాంబాబు.

Read Also: Ambati Rambabu: పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై క్లారిటీ ఇచ్చిన ఇరిగేషన్‌ మంత్రి

ఇక, సింగిల్‌గా పోటీ చేసే ధైర్యం తనకు లేదని చంద్రబాబు ఒప్పుకున్నారని కామెంట్‌ చేశారు అంబటి… చంద్రబాబు నిర్దేశం మేరకే పవన్‌ ఢిల్లీ టూరని విమర్శించారు.. చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్‌ పార్టీ పెట్టారా? అని ప్రశ్నించారు. మరోవైపు.. జనసేన పార్టీ గ్రాఫ్‌ రోజురోజుకు పడిపోతుందన్న ఆయన.. పోలవరం ప్రాజెక్టుపై నాదెండ్ల మనోహర్‌ అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. అవాకులు, చవాకులు పేలుతున్నారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు అస్తవ్యస్తం చేశారు. కానీ, పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదన్నారు.. ఈ విషయాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ఇప్పటికే అసెంబ్లీలో స్పష్టం చేశారని గుర్తుచేశారు.. దెబ్బతిన్న పోలవరం డయాఫ్రమ్‌వాల్‌ను రిపేర్‌ చేస్తున్నాం. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతినడం వల్లే పనులు ఆలస్యం అయ్యిందన్నారు.. వీలైనంత త్వరగా పోలవరాన్ని పూర్తి చేస్తాం అని పేర్కొన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఇక, 175 సీట్లలో పోటీ చేసే ధైర్యం లేని వ్యక్తి చంద్రబాబు.. ఆయన వెళ్లమంటేనే వారాహి బ్యాచ్ ఢిల్లీ వెళ్లింది. బీజేపీతో విడాకులు తీసుకోమని చంద్రబాబు చెప్పి పంపారు. కానీ, వారాహి బ్యాచ్ కి పనికాలేదు. కాపుల ఓట్లు చీల్చితే కొంత మెరుగు పడవచ్చని చంద్రబాబు ఆశగా చెప్పుకొచ్చారు అంబటి రాంబాబు.