NTV Telugu Site icon

Ambati Rambabu: టీడీపీ మోసాలకు పాల్పడే పార్టీ.. నన్ను ఓడించేందుకు కొత్త వస్తాదుల్ని తెస్తున్నారు

Ambati Rambabu On Cbn

Ambati Rambabu On Cbn

Minister Ambati Rambabu Satires On Chandrababu Naidu And TDP Manifesto: తెలుగుదేశం మోసాలకు పాల్పడే పార్టీ అంటూ మంత్రి అంబటి రాంబాబు మరోసారి ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు మహానాడులో కొత్త కొత్త డ్రామాలు చేస్తున్నాడని విమర్శించారు. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో నిర్వహించిన బీసీ సదస్సులో మంత్రి మాట్లాడుతూ.. సత్తెనపల్లిలో నన్ను ఓడించేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్, చంద్రబాబు సత్తెనపల్లిలో పర్యటిస్తున్నారని అన్నారు. తనని ఓడించాలన్న ప్రధాన లక్ష్యంతోనే వాళ్లిద్దరు సత్తెనపల్లిలో మీటింగ్‌లు పెడుతున్నారన్నారు. తన మీద పోటీకి కొత్త కొత్త వస్తాదుల్ని తెరమీదకి తెస్తున్నారని చెప్పారు. తనతో పాటు రాష్ట్రంలో కొడాలి నాని, మంత్రి రోజాను ఓడించడానికి కూడా చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు.

Anakapalle Crime: ప్రేమోన్మాది కేసులో సంచలన విషయాలు.. పక్కా స్కెచ్‌తోనే!

పేదల్ని ధనవంతుల్ని చేస్తానంటున్న చంద్రబాబుకి.. అబద్ధం చెప్పడానికైనా సిగ్గుండాలని అంబటి రాంబాబు దుయ్యబట్టారు. తన వద్ద పేదవారికి ధనవంతుల్ని స్కీమ్ ఉందని చంద్రబాబు అంటున్నారని.. బహుశా ఆయన వద్ద అల్లావుద్దీన్ అద్భుతదీపం లాంటి మంత్రాలేమైనా ఉన్నాయేమోనని సెటైర్ వేశారు. 14 ఏళ్ల పాటు సీఎంగా ఉన్నప్పుడు.. ఒక్క పేదవాడినైనా ధనవంతుడ్ని చేశావా? బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో ఏ ఒక్కరినైనా పైకి తీసుకొచ్చావా? అని ప్రశ్నించారు. ఏ ఒక్క పని కూడా చేయని దుర్మార్గపు పాలన చంద్రబాబుది అని విమర్శించారు. ఈసారి తనని గెలిపిస్తే, ఎప్పుడూ లేనంత గొప్ప పరిపాలన చేస్తానంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హ్యాస్యాస్పదంగా ఉన్నాయని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. టీడీపీ కంటే పది రేట్లు బీసీలకు న్యాయం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని ఉద్ఘాటించారు. ప్రజలు చంద్రబాబును నమ్మే పరిస్థిలో లేరని తేల్చి చెప్పారు.

World no tobacco day: స్మోకింగ్ కు దూరంగా ఉండాలంటే.. ఈ టిప్స్ ను ఫాలో అవ్వాల్సిందే..!!

అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క పని చేయని చంద్రబాబు.. ఇప్పుడు అధికారంలో లేకుండానే అది చేస్తా, ఇది చేస్తానంటే ఎవరు నమ్ముతారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. డ్వాక్రా మహిళల రుణమాఫీ, రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి.. చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. మేనిఫెస్టోని ప్రకటించిన అనంతరం ‘ఏ తమ్ముళ్లు అదిరిందా’ అని చంద్రబాబు అనడాన్ని తాను గమనించానని.. రేపు ఎన్నికల్లో తప్పకుండా అదురుతుందని, తమ వైసీపీ పార్టీనే తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.