Site icon NTV Telugu

Ambati Rambabu: చంద్రబాబు చేస్తే ఒప్పు.. మేం చేస్తే తప్పా..?

Ambati Rambabu

Ambati Rambabu

అధికారం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అధికారం లేకపోతే చంద్రబాబు పిచ్చెక్కిపోతాడని ఆరోపించారు. ఆయన జిమ్మిక్కులను నమ్మే స్థితిలో ప్రజలు లేరని ఎద్దేవా చేశారు. అవకాశం దొరికితే దేశాన్ని నాశనం చేయగలిగే సత్తా ఉన్న వ్యక్తి చంద్రబాబు అని.. అసలు రాయలసీమకు ఆయన ఏం చేశారో చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. 151 సీట్లు తెచ్చుకున్న వ్యక్తి సీఎం పదవికి అనర్హుడట… 23 స్థానాలు మాత్రమే తెచ్చుకున్న ఆయన అర్హుడట అంటూ చంద్రబాబుపై సెటైర్లు వేశారు.

Beeda Mastanrao: డబ్బులిస్తే రాజ్యసభ సీటిస్తారా? అయితే రూ.200 కోట్లు ఇచ్చేవాళ్లున్నారు

తాము బీసీలకు రాజ్యసభ సీటు ఇస్తే చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. తాము రాజ్యసభ సీట్లను అమ్ముకున్నామని చంద్రబాబు ఆరోపించడం నీచ రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. టీజీ వెంకటేష్ దగ్గర ఎంత తీసుకుని ఆయన రాజ్యసభ టిక్కెట్ ఇచ్చారో చెప్పాలన్నారు. పక్క రాష్ట్రాలకు చెందిన నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభుకు చంద్రబాబు రాజ్యసభ సీటు ఇస్తే తప్పులేనిది.. తాము పక్క రాష్ట్రానికి చెందిన వారికి ఇస్తే తప్పా అని నిలదీశారు. టిక్కెట్లు అమ్ముకుని, కొనుక్కునే సామర్థ్యం చంద్రబాబుకే ఉందని ఆరోపించారు. ఓటును నోటుతో కొనుక్కుని రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి ఇక్కడికి పారిపోయి రాలేదా అని ప్రశ్నించారు. అధికారం కోసమే ఆరాటపడుతూ చంద్రబాబు యాత్రల మీద యాత్రలు చేస్తున్నారని విమర్శలు చేశారు. ఆయన ఎప్పటికీ మాజీ సీఎంగానే ఉంటారని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ను ఓడించే సత్తా చంద్రబాబు, పవన్‌కు లేవన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీబీఐ, ఈడీలు ఈ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీల్లేదని చెప్పినట్లు మరిచిపోయారా అని ప్రశ్నించారు.

 

 

Exit mobile version