Site icon NTV Telugu

Ambati Rambabu vs Nagababu: అవును నేను సంబరాల రాంబాబునే.. అంబటి కౌంటర్‌

Ambati Rambabu Vs Nagababu

Ambati Rambabu Vs Nagababu

Ambati Rambabu vs Nagababu: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంక్రాంతి పండుగ కూడా కాకరేపుతోంది.. పండుగ సమయం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్సెస్‌ జనసేన పార్టీగా మారిపోయింది.. భోగీ సందర్భంగా ఉత్సాహంగా డ్యాన్స్‌లు వేశారు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు.. ఇక, భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ.. ఆయన మహిళలు, గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్‌ చేసిన ఆ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.. ఇదే తాజా మాటల యుద్ధానికి కారణమైంది.. ఆ వీడియోను రీట్వీట్‌ చేస్తూ సెటైర్లు వేసిన జనసేన నేత, సినీ నటుడు నాగబాబు.. అంబటి రాంబాబును ఉద్దేశిస్తూ ”సంబరాల రాంబాబు గారు మీరు డ్యాన్స్ మహత్తరంగా చేసారు.. పోలవరం పూర్తి చేసి డ్యాన్స్ చేసి వుంటే ఇంకా మహత్తరంగా వుండేది !” అని కామెంట్లూ పెడుతూ ఎద్దేవా చేశారు..

Read Also: Supreme Court: వైఎస్‌ వివేకా హత్య కేసు.. గంగిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌ తెలంగాణకు బదిలీ

అయితే, నాగబాబు ట్వీట్‌పై అదే స్థాయిలో రియాక్ట్‌ అయ్యారు మంత్రి అంబటి రాంబాబు.. అవును నేను సంబరాల రాంబాబునే అంటూనే కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు.. “నువ్వు, మీ తమ్ముడు అన్నట్టు “సంబరాల రాంబాబు”నే ! కానీ.. ముఖానికి రంగు వేయను.. ప్యాకేజీ కోసం డాన్స్ చేయను !” అంటూ ఘాటుగా బదులిచ్చారు.. దీంతో.. మరోసారి సోషల్‌ మీడియా వేదికగా.. జనసేన వర్సెస్‌ వైసీపీగా పరిస్థితి మారిపోయింది.. కొందరు అభిమానులు, జనసేన శ్రేణులు.. పవన్‌ కల్యాణ్, నాగబాబుకు అనుకూలంగా కామెంట్లు పెడుతూ.. అంబటిపై ఫైర్‌ అవుతుంటే.. మరికొందరు.. అంబటికి మద్దతుగా నిలిస్తూ మెగా బ్రదర్స్‌ను టార్గెట్‌ చేస్తున్నారు. కాగా, రణస్థలం వేదికగా జనసేన నిర్వహించిన యువశక్తి సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన తర్వాత.. ట్విట్టర్‌లో మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేసిన సంగతి విదితమే.. PK అంటే పిచ్చి కుక్క అంటూ ఘాటుగా కౌంటర్‌ ఇచ్చిన ఆయన.. నేను సంబరాల రాంబాబునైతే.. నువ్వు కల్యాణాల పవన్ వి ! అంటూ మరో ట్వీట్‌ చేశారు.. రోజా డైమండ్ రాణి అయితే.. నువ్వు బాబు గారి జోకర్ వి ! అంటూ మరో ట్వీట్‌తో మంత్రి రోజాపై పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి అంబటి రాంబాబు కౌంటర్‌ ఇచ్చిన విషయం విదితమే..

Exit mobile version