Polavaram Irrigation Project: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలవరం ప్రాజెక్టులో జాప్యం కొనసాగుతూనే ఉంది.. అయితే, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తొందరపాటు ఏమాత్రం పనికిరాదన్నారు మంత్రి అంబటి రాంబాబు.. గత ప్రభుత్వం తొందరపాటుతో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో జరుగుతున్న పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిపుణుల ఇచ్చిన రిపోర్ట్ అనంతరం డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మాణం చేయాలా లేక పాతది కొనసాగించాల అనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇదికీలక పరిణామం. కాఫర్ డ్యామ్ లు పూర్తి చేసిన తర్వాత డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేయాలి. గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రాజెక్టు నిర్మాణం మరింత ఆలస్యం అవుతుందన్నారు. 41.17 కాంటూరు పరిధి వరకు ఆర్.అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తి చేయడం జరుగుతుందని.. ప్రతి విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సిందేనన్నారు.. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా రెండువేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా అలసత్వం ప్రదర్శించడంలేదని స్పష్టం చేశారు మంత్రి అంబటి రాంబాబు.
నేను మంత్రిగా ఉన్నప్పుడే ప్రాజెక్టు పూర్తి చేయాలని తొందరపాటు లేదు.. ప్రాజెక్టు నిర్మాణంలో తొందరపాటుతో అనేక ఇబ్బందులు వస్తాయన్నారు మంత్రి అంబటి. మరోవైపు.. అప్పర్ భద్ర ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.. రాయలసీమ ప్రజలు ఏమాత్రం కంగారుపడాల్సిన అవసంలేదు.. ప్రభుత్వం న్యాయపోరాటం చేయడానికి సిద్దంగా ఉంది. ఉపనధులైన తుంగ, భద్ర నుంచి 42 టీఎంసీలతో ప్రాజెక్టు నిర్మాణం చేయలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.. దీని వల్ల ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయనేది ప్రభుత్వ భావన.. జలాలు కేటాయింపు విషయంలో కృష్టవాటర్ బోర్డు, బచావత్ కమీషన్ చెప్పిందో అదే విధంగా నీటి కేటాయింపులు జరగాలన్నారు మంత్రి అంబటి రాంబాబు.. కాగా, ఈ మధ్యే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేసింది కేంద్రం.. పోలవరం ప్రాజెక్టును మార్చి 2024 కల్లా పూర్తి చేయాలన్నది లక్ష్యంగా ప్రకటించారు కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు.. దీని కోసం జూన్ 2024 కల్లా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పూర్తి చేయాలన ఆదేశాలు జారీ చేశారు.. అయితే, గోదావరి నదికి ఇటీవల వచ్చిన వరదల కారణంగా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు.