Site icon NTV Telugu

Adimulapu Suresh: ప్రజలు మోసం చేసేందుకే.. చంద్రబాబు కొత్త మేనిఫెస్టో

Adimulapu Suresh On Cbn

Adimulapu Suresh On Cbn

Minister Adimulapu Suresh Fires On Chandrababu Manifesto: ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ తారాస్థాయిలో విరుచుకుపడ్డారు. తన హయాంలో రైతులకు రూ.85 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని అన్నారు. మహిళలను, యువతను, రైతులను టీడీపీ ప్రభుత్వం మోసి చేసిందని ఆరోపించారు. ఇప్పుడు తగుదునమ్మా అంటూ.. ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు కొత్త మేనిఫెస్టోతో ముందుకు వస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ పథకాలను విమర్శించి, ఎగతాళి చేసిన వ్యక్తే.. ఇప్పుడు పేర్లు మార్చి, అవే పథకాలను పెడతామంటున్నాడని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు మాయమాటలు నమ్మే పరిస్దితిలో లేరని.. ముఖ్యంగా మహిళలు బాబును నమ్మే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రజలు మాయలోళ్ల మాటలు నమ్మి, వారి గారడీలో పడొద్దని సూచించారు. మహిళలు, యువతకు తమ వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు.

MP Margani Bharath: వైసీపీ ప్రభంజనం ముందు టీడీపీ వెలవెలబోతోంది

అంతకుముందు కూడా.. టిడ్కో నిర్మాణాలపై టీడీపీ నేతలు పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆదిమూలపు సురేష్ మండిపడ్డారు. టీడీపీ నేతలు ప్రారంభించిన ఇళ్లలో ఒకరైన నివాసం ఉంటున్నారా అని నిలదీసిన ఆయన.. టిడ్కో లేఔట్‌లలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే సీఎం జ‌గ‌న్‌ లక్ష్యమ‌ని పేర్కొన్నారు. ప్రజలు నేరుగా వచ్చి నివాసముండేలా 50 వేల టిడ్కో ఫ్లాట్లను 100 శాతం నిర్మించామన్నారు. వైసీపీ హయాంలో టిడ్కో లబ్ధిదారులకు 400 కోట్ల రాయితీలు ఇచ్చామన్నారు. జగన్ ఇస్తున్న ఇళ్లకు, టీడీపీ నేతలు చెబుతున్న ప్లాట్లకు ఎటువంటి పోలిక లేదన్నారు. 14 వేల కోట్ల అదనపు ఖర్చుతో లేఔట్‌ల అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

Vidadala Rajini: దోచుకో, దాచుకో విధానం చంద్రబాబు పాలనలో జరిగింది

Exit mobile version