Merugu Nagarjuna Fires On Chandrababu Naidu: ఏపీ మంత్రి మేరుగ నాగార్జున తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని సామాజిక వర్గాలు కలిసి.. చంద్రబాబును తరిమికొడతాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక విప్లవానికి సీఎం జగన్ తెర తీశారని చెప్పిన ఆయన.. శాసనమండలిలో 44 మందిలో 33 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉండబోతున్నారని అన్నారు. ‘దళితుల్లో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా’ అని చంద్రబాబు అనలేదా? బీసీల తోకలు కట్ చేస్తామన్నది చంద్రబాబు కాదా? మంత్రివర్గ కూర్పు సమయంలో మైనార్టీలు చంద్రబాబుకు గుర్తుకు రాలేదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. రాబోవు రోజుల్లో రాష్ట్రంలో సామాజిక రణరంగం రాబోతుందని జోస్యం చెప్పారు. మా జాతులన్నీ చంద్రబాబు భరతం పడతాయని.. ఆయన్ను సామాజికంగా వెలివేయాలని ధ్వజమెత్తారు.
Ram Charan: పాపులర్ షోకి గెస్టుగా మెగా పవర్ స్టార్…
అంతకుముందు.. దళితుల గురించి మాట్లాడే అర్హత నారా లోకేష్‌కు లేదని మేరుగ నాగార్జున విరుచుకుపడ్డారు. సబ్‌ప్లాన్ అంటే లోకేష్‌కు అసలు తెలుసా? అని ప్రశ్నించారు. పాదయాత్రలో జనం లేక లోకేష్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. దళితులను మోసం చేసిన చరిత్ర.. దళితుల నిధులను పక్కదారి పట్టించిన ఘనత చంద్రబాబుదేననని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు సబ్‌ప్లాన్‌ను అమలు చేశారని, కానీ చంద్రబాబు వాటిని నాశనం చేశాడని ఆరోపించారు. దళితుల అభ్యున్నతికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కృషి చేస్తోందని.. ఎస్సీ, ఎస్టీ కాంపోనెంట్ ప్లాన్ కింద నిధులు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్య, ఇళ్ల పట్టాలు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారన్నారు. గతంలో ఎస్సీలకు రుణాలు పేరుతో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. చంద్రబాబు హయాంలో దళితులపై జరిగిన దాడులపై చర్చించడానికి తాను సిద్ధమేనని ఛాలెంజ్ చేశారు.
Air India order support US jobs: బోయింగ్‌కి ఎయిరిండియా ఆర్డర్ వల్ల అమెరికాలో ఎన్నో జాబులు: బైడెన్