Site icon NTV Telugu

Mekathoti Sucharita: పవన్‌ కల్యాణ్‌ కలలు కంటున్నారు..

Mekathoti Sucharita

Mekathoti Sucharita

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విముక్త ఆంధ్రప్రదేశ్‌ అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు మాజీ హోంమంత్రి, వైసీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత.. పవన్ కల్యాణ్‌ వైసీపీ విముక్త ఏపీ అంటూ కలలు కంటున్నారు.. అలాగే కననివ్వండి అంటూ ఎద్దేవా చేశారు.. ఇక, ఈ దేశంలో ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉంది.. ఏదైనా మాట్లాడొచ్చు అన్నారు.. మరోవైపు.. గడపగడపకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ కార్యక్రమాల అమలు ఎలా ఉందో తెలుసుకునే అవకాశం వస్తుంది… జగనన్న ప్రభుత్వంలో ప్రతీ మహిళ సాధికారత సాధిస్తుందన్న నమ్మకం కుదిరిందన్నారు మేకతోటి సుచరిత.

Read Also: Tension in Chandrababu Kuppam Tour: చంద్రబాబు కుప్పం పర్యటనలో ఉద్రిక్తత..

ఇక, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలపై స్పందించిన ఆమె.. అవసరాన్ని బట్టి పార్టీలో మార్పులు చేర్పులు జరుగుతాయి… పార్టీలో మరికొందరి బలం అవసరం ఉందనుకుంటే నాయకుల్ని ప్రోత్సహించడం తప్పేమీ కాదన్నారు.. పార్టీ బలోపేతానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తీసుకునే నిర్ణయానికి కార్యకర్తలు, నాయకులు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతీ పార్టీలోనూ అసంతృప్తులు ఉంటాయి…. నలుగురు, కలిసి ఉండే ఇంట్లోనే అసంతృప్తి ఉన్నప్పుడు, ఒక రాష్ట్రాన్ని నడిపించే పార్టీలో అసంతృప్తి ఉండటం సహజమే కదా? పార్టీలో అసంతృప్తులు ఉంటే వాటిని సర్దుబాటు చేసుకుంటాం.. మేం ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాటకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు మేకతోటి సుచరిత.

Exit mobile version