Rajahmundry MP Margani Bharath Ram Made Comments on TDP.
గత మూడేళ్లలో దేశ సగటు కంటే మిన్నగా ఏపీ రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో సాధారణ పరిస్థితులు ఉన్నప్పటికీ ఏడాదికి సగటున రాష్ట్ర తలసరి ఆదాయం రూ.12,025 పెరిగిందని, కోవిడ్ సంక్షోభంలో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రూ.17,913 పెరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు వెన్నుపోటు పొడిచి గద్దె ఎక్కితే, స్వయంకృషితో జగన్ అధికారంలోకి వచ్చారని ఆయన వెల్లడించారు. టీడీపీ హయాంలో వీధికో బెల్ట్ షాపు ఉండేదని, కానీ..నేడు ఆ పరిస్థితి లేదని ఆయన తెలిపారు.
టీడీపీ నేతలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసి బుదురజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టూరిజం అభివృద్ధికి ప్రయత్నం చేస్తున్నామని, కేంద్ర టూరిజం బడ్జెట్ 2వేల కోట్ల రూపాయలేనని, కేంద్ర టూరిజం బడ్జెట్ ఉద్యోగుల జీతాలకే పరిమితమైందన్నారు. రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు ఆరికడతామని, త్వరలో రాజమండ్రిలో పోలీసు కమీషనరేట్ ఏర్పాటు చేస్తామన్నారు. రౌడీషీటర్లు చేతులపై పచ్చబోట్టులు వేయించుకున్న నేత బ్లేడు బ్యాచ్ పై మాట్లాడటం విడ్డూరంగా ఉందని, రౌడీషీటర్లను నా దగ్గరకు రానివ్వనని ఆయన స్పష్టం చేశారు.