NTV Telugu Site icon

AP: ఎమ్మెల్యేకు మాయిస్టుల హెచ్చరిక.. రాజీనామా చేసి మన్యం వీడండి..!

విశాఖ మన్యంలో మావోయిస్టుల తాజా లేఖ కలకలం రేపుతోంది… అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని హెచ్చరిస్తూ లేఖ రాశారు మావోయిస్టులు.. లేట్రైట్ మైనింగ్ ముసుగులో బాక్సైట్ అక్రమ తవ్వకాలకు ఎమ్మెల్యే ప్రోత్సహిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించిన మావోయిస్టులు.. జీకే వీధి మండలం చాపరాతి పాలెంలో జరుగుతున్న మైనింగ్‌ను తరిమి కొట్టాలని లేఖ విడుదల చేశారు.. పార్టీలకు పదవులకు రాజీనామా చేసి మన్యం విడిచిపోవాలని లేఖలో డిమాండ్‌ చేసింది మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కమిటీ… లేదా మాజీ ఎమ్మెల్యేలు సివేరి సోమ, కిడారి సర్వేశ్వరరావు తరహాలోనే ప్రజాకోర్టులో ప్రజలు శిక్షిస్తారని హెచ్చరించారు.. మావోయిస్టు పార్టీ ఈస్ట్ డివిజన్ కార్యదర్శి అరుణ పేరుతో ఈ లేఖ విడుదలైంది.