CPI Ramakrishna: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో ఈరోజు మావోయిస్టు కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మాను, అతని భార్యతో సహా ఆరుగురిని పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై దుర్మార్గం అని సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టు నేతలు ప్రకటించినప్పటికీ కేంద్రం దమనకాండ కొనసాగించటం దారుణం అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాల్సిందిపోయి, ఎన్ కౌంటర్ల పేరుతో నిర్దాక్షిణ్యంగా మావోయిస్టులను చంపటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.. ఆంధ్ర, తెలంగాణ బోర్డర్లో ఈరోజు జరిగిన కాల్పులపై న్యాయ విచారణ జరిపించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
అయితే, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా హింసాత్మక విధానాలు మాని, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా మావోయిస్టులతో చర్చలు జరపాలని సీపీఐ తరఫున డిమాండ్ చేస్తున్నాం అని రామకృష్ణ తెలిపారు.