NTV Telugu Site icon

Police Station: పీఎస్‌లో అనుమానాస్పద మృతి.. సీఐ సహా నలుగురు పోలీసులపై వేటు

Rayadurgam

Rayadurgam

Police Station: అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఓ దొంగ అనుమానాస్పద మృతి కేసు పోలీసులపై వేటు పడేలా చేసింది.. ఈ ఘటనపై కల్యాణదుర్గం డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. రాయదుర్గంలో గొర్రెల దొంగతనం జరగడంతో ఇద్దరు దొంగలను స్థానికులు పట్టుకుని సోమవారం తమకు అప్పగించారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈరోజు రిమాండ్​కు పంపవలసి ఉంది. రామాంజనేయులు అలియాస్ అంజి, శ్రీనివాసులు ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందినారు. రామాంజనేయులపై దాదాపు 15 గొర్రెల దొంగతనం కేసులు ఉన్నాయని తెలిపారు.. అయితే.. రామాంజనేయుులు అతని లుంగీతో ఫ్యాన్​కు ఉరి వేసుకుని ఉండటంతో అక్కడ ఉన్నవారు కేకలు వేయడంతో సిబ్బంది అప్రమత్తమై అసుపత్రికి తీసుకెళ్లారు… కానీ, అప్పటికే చనిపోయాడని.. దీనిపై కేసు నమోదు చేశాం.. కొందరు డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని.. కాబట్టి ఉన్నతాధికారులు వారిని సస్పెండ్‌ చేశారు.. ఈ ఘటనలో సీఐ శ్రీనివాసులు, హోంగార్డు రమేష్‌, ఇద్దరు కానిస్టేబుళ్లు మధుబాబు, గంగన్నలను సస్పెండ్‌ చేశారు.

Read Also: Minister Errabelli: ఆ..ఎమ్మెల్యేలను మారిస్తే100 సీట్లు గ్యారెంటీ.. ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు..

అయితే, రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కురుబ రామాంజనేయులు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నిన్న గొర్రెల దొంగతనానికి వచ్చిన రామాంజనేయులు.. పైతోటవాసులకు పట్టుబడ్డాడు. ఆంజనేయులుతో పాటు మరో దొంగను చితకబాది.. పైతోటవాసులు పోలీసులకు అప్పగించారు. కానీ, పీఎస్‌లో అతడు మృతి చెందడం అనుమానాలను రేకెత్తిస్తోంది. పోలీసులు కొట్టి చంపారా.. లేక ఆత్మహత్యనా? అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఎస్పీ ఫక్కీరప్ప.. రాయదుర్గం పట్టణ పోలీసుస్టేషన్ లో దొంగ ఆత్మహత్య చేసుకున్న కంప్యూటర్ గదిని పరిశీలించిన ఆయన.. సిబ్బంది నిర్లక్ష్యంగా స్పష్టంగా కనబడుతోందన్నారు.. బ్యారెక్ లో ఉండాల్సిన ఇద్దరు దొంగలను కంప్యూటర్ గదిలో ఎందుకు ఉంచారని ఆరా తీశారు.. ఘటనప్తె విచారణాధికారిగా అనంతపురం ఇంఛార్జ్ డీఎస్పీ మహబూబ్ బాషాను నియమించారు.. ఎన్ హెచ్ ఆర్సీ నిబంధన మేరకు గ్రూప్ అప్ డాక్టర్స్ తో పోస్టుమార్టం నిర్వహిస్తామన్నారు. ఆత్మహత్య ఘటనపై మేజిస్ట్రీయల్ విచారణ జరిపిస్తామన్నారు.. సీఐ శ్రీనివాస్, ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డును ఇప్పటికే సస్పెండ్‌ చేసినట్టు వెల్లడించారు ఎస్పీ ఫక్కీరప్ప.

Show comments