AP Crime: బీరుసీసాలతో దాడి చేసిన సీన్లు సినిమాల్లో తరచూ చూస్తుంటాం.. హీరోపై బీరుబాటిళ్లతో దాడి చేసిన వినల్లు.. ఇక, వినల్లపై తిరగబడి.. నెత్తిపై.. వారీ శరీరంపై బీరు బాటిళ్లతో హీరో దాడి చేసిన సీన్లు చాలా సినిమాల్లో ఉన్నాయి.. కానీ, ఇదే తరహాలో కట్టుకున్న భార్యపై దాడికి పాల్పడ్డాడో ఓ వ్యక్తి.. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యపై బీరు సీసాతో భర్త దాడి చేసిన ఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వెలుగు చూసింది..
Read Also: Balayya: ఏంటయ్యా నవదీప్ నీ నాన్సెన్స్… డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరకడమేగా
ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని బీసీ కాలనీలో నివాసముంటున్న శ్రీలక్ష్మికి, భర్త ఆంజనేయులు మధ్య గత కొంతకాలంగా విభేదాల ఉన్నాయి.. ఈ నేపథ్యంలో భర్తకు దూరంగా ఉన్నంటున్న శ్రీలక్ష్మి.. ఒంటరిగా ఉంటూ జీవనం సాగిస్తోంది.. అయితే, ఈ రోజు ఉదయం ఆంజనేయులు ఇంటిలో ఒంటరిగా ఉన్న శ్రీలక్ష్మిపై దాడి చేశాడు.. బీరుసీసాతో దాడికి పాల్పడ్డాడు.. ఈ దాడిలో శ్రీలక్ష్మి తీవ్రంగా గాయపడింది.. తీవ్ర గాయాలపాలైన శ్రీలక్ష్మిని గుర్తించిన స్థానికులు నందిగాం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధిత మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.. ఇక, శ్రీలక్ష్మి ఫిర్యాదు మేరకు ఆమె భర్త ఆంజనేయులుపై నందిగాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక, ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. తన భర్త జేబు దొంగ.. నన్ను వేధింపులకు గురిచేస్తున్నాడు.. కొడుతున్నాడని.. దూరంగా ఉన్నాను.. అమ్మవాళ్ల ఇంటి దగ్గరలోనూ ఇల్లె అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నాను.. ఈ రోజు వచ్చి దాడి చేశాడని కన్నీరుమున్నీరు అవుతోంది.