నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాలను మనం చూస్తూనే ఉంటాం ప్రమాదాలకు గురైన వాహనాలు దెబ్బతినడం కూడా చూస్తూనే ఉంటాం కానీ ఇక్కడ మీరు చూస్తున్నది రోడ్డు ప్రమాదానికి గురైన ఒక కారు. ఆనవాళ్లు కూడా లేకుండా ఇనుప ముద్దలాగా మారిపోయింది. ఈ కారు అంటే ఎంత వేగంతో ఈ కారు ఆ లారీని ఢీ కొట్టిందో చూస్తే అర్థమవుతుంది.ఈ ప్రమాదంలో ముగ్గురు వైద్య విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎవరైనా చెప్తే కానీ ఇది కారు అని గుర్తుపట్టలేనంత గా ధ్వంసం అయ్యిందంటే ప్రమాదం స్థాయి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.రూపు రేఖలు లేకుండా పోయిన ఈ కారు మారుతి స్విఫ్ట్.
చిత్తూరు జిల్లా కుప్పం(Kuppam) లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిపల్లి మండలం సెట్టిపల్లి పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొంది కారు. ముగ్గురు వైద్య విద్యార్థులు (Medical Students) మృతిచెందారు. మృతులు PES మెడికల్ కాలేజ్ విద్యార్థులుగా గుర్తించారు. PES ఆసుపత్రిలో ముగ్గురు డాక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. మృతులు వికాస్,కళ్యాణ్, ప్రవీణ్ గా గుర్తించారు. గడిపల్లి మండలం సెట్టిపల్లి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.
దీంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. వీరిలో ఇద్దరు కడప (Kadapa) జిల్లాకు, ఒకరు నెల్లూరు (Nellore) జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. ఈఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు వైద్యవిద్యార్ధుల మృతిలో విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన తీరు హృదయవిదారకంగా వుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాలాపూర్ లో హత్య కలకలం
హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మర్డర్ కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే ఉస్మాన్ నగర్ కు చెందిన మామా జఫర్ కుమారుడు పైసల్ ఈనెల 12న అర్ధరాత్రి 9 గంటల సమయంలో ఇంటి నుంచి ఉస్మానియా హోటల్ వెళుతున్నాను అని చెప్పి వెళ్ళాడు. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎంత వెతికినా ఆచూకీ లభించక తండ్రి జాఫర్ బాలాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అనంతరం నిన్న రాత్రి తేదీ 25 రాత్రి 1 సమయాన మర్డర్ జరిగిందని తేలింది. అగంతకుడు జబ్బార్ తండ్రి అబ్దుల్ రహీం వయసు 17 వృత్తిరీత్యా కాస్మెటిక్ సేల్స్ చేస్తుంటాడు. అతని నివాసం మినర్ కాలనీ షాహిన్ నగర్. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని డెడ్ బాడీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Team India: సెమీ ఫైనల్లో ఓటమి తర్వాత దీప్తి శర్మకు కొత్త బాధ్యత