Site icon NTV Telugu

Tollywood: వారం, పది రోజుల్లో గుడ్ న్యూస్ వింటారు: మహేష్‌బాబు

టాలీవుడ్‌లో నెలకొన్న సమస్యలు, ఏపీలో టిక్కెట్ రేట్ల అంశంపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌తో సినీ పెద్దలు సమావేశమయ్యారు. ఈ భేటీలో చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, నటులు ఆర్.నారాయణమూర్తి, అలీ, పోసాని కృష్ణమురళి పాల్గొన్నారు. మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 14 రకాల విజ్ఞప్తులను టాలీవుడ్ బృందం సీఎంకు వివరించింది.

ఈ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో హీరో మహేష్‌బాబు మాట్లాడాడు. ఆరు నెలలుగా సినిమా ఇండస్ట్రీ పూర్తిగా కన్ఫ్యూజన్‌లో ఉందని.. ఈ సమస్యను పరిష్కరించడానికి ముందుకు వచ్చిన చిరంజీవికి తొలుత కృత‌జ్ఞత‌లు చెప్పుకోవాల‌న్నాడు. నిజానికి ఈరోజు సీఎం జగన్‌తో సమావేశమయ్యాక చాలా పెద్ద రిలీఫ్‌గా ఉందన్నాడు. ఆయ‌న మొద‌టి నుంచీ చొర‌వ చూపి స‌మ‌స్య ప‌రిష్కారానికి కృషి చేశార‌ని వివరించారు. త్వరలోనే ఓ గుడ్ న్యూస్ వింటార‌ని.. వారం లేదా ప‌ది రోజుల్లోనే ఆ శుభవార్త వ‌స్తుంద‌ని మహేష్ చెప్పాడు.

Exit mobile version