NTV Telugu Site icon

Weather Update: బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మళ్లీ వర్షాలు..!

Weather

Weather

ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేశాయి.. జులైతో పాటు.. ఈ నెలలో వర్షాలు, వరదలు సృష్టించిన విలయం నుంచి ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు బయటపడలేదు.. ఈ సమయంలో.. సముద్రంలో అల్పపీడనం, వాయుగుడం, తుఫాన్‌ లాంటి పదాలు వినపడితేనే ఉలిక్కిపడుతున్నారు ప్రజలు.. అయితే, ఇప్పుడు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం క్రమంగా బలపడుతోంది.. రేపటికి వాయుగుండంగా మారి పశ్చిమ బెంగాల్ దగ్గర తీరం దాటే అవకాశం ఉందని వాతావారణ శాఖ అంచనా వేస్తోంది.. ఆ తర్వాత ఉత్తర ఒడిషా , జార్ఖండ్ వైపు వాయుగుండం పయనిస్తుందని.. దాని ప్రభావంతో.. ఇవాళ రేపు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని ప్రకటించింది. ఇక, వాయుగుండం ప్రభావం తెలుగు రాష్ట్రాలపై స్వల్పమే అని పేర్కొంది తుఫాన్ హెచ్చరికల కేంద్రం.

Read Also: Boris Johnson: రేసులో ఉంటే మళ్లీ బోరిస్ జాన్సనే ప్రధాని!

అయితే, ఈ వాయుగుండం రాబోయే రెండు రోజుల్లో ఉత్తర కోస్తాపై కొంతమేర ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తా జిల్లాల్లో శుక్ర, శనివారాల్లో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఉరుములు, మెరుపులతోనూ వానలు పడుతాయంటున్నారు. వర్షం ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది . ఇక, రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రాయలసీమలో రెండు రోజుల పాటూ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణశాఖ.

సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉన్న తుఫానుతో కూడిన అల్పపీడన ప్రాంతం కొనసాగుతుందని తెలిపింది ఐఎండీ.. ఇది వచ్చే ఆరు గంటల్లో వాయువ్య దిశగా కదులుతూ అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉంది. వాయువ్య దిశగా కదులుతూ, ఉదయం ఉత్తర బంగాళాఖాతం మరియు ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ మరియు బంగ్లాదేశ్ తీరాల మీదుగా అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత గంగానది పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ మరియు ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుండి కొమొరిన్ ప్రాంతం వరకు ఉత్తర-దక్షిణ ద్రోణి ఇప్పుడు రాయలసీమ నుండి కొమొరిన్ ప్రాంతం వరకు తమిళనాడు అంతర్భాగం మీదుగా సాగుతుందని మరియు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ వరకు విస్తరించి ఉందని పేర్కొంది.

Show comments