NTV Telugu Site icon

Lokayukta: కర్నూలులో లోకాయుక్త ఆఫీస్

Loka1

Loka1

ఏపీలో మూడురాజధానుల్లో భాగంగా కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర లోకాయుక్త కార్యాలయాన్ని కర్నూలులో ఇంతకుముందే ఏర్పాటు చేశారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహం మూడో నెంబరు గదిలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని లోకాయుక్త జస్టిస్‌ పి.లక్ష్మణ్‌రెడ్డి ప్రారంభించారు. ఇంతవరకు హైదరాబాద్‌లో కొనసాగిన లోకాయుక్త, ఉపలోకాయుక్త కార్యకలాపాలను ఇకపై కర్నూలు నుంచి నిర్వహిస్తారు.

తాజాగా కర్నూలు సంతోష్ నగర్ లో లోకాయుక్త నూతన కార్యాలయాన్ని జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ప్రారంభించారు. వేదపండితులు పూర్ణ కుంభంతో జస్టిస్ లక్ష్మణ్ రెడ్డికి స్వాగతం పలికారు. లోకాయుక్త సంస్థ చైర్మన్ ఛాంబర్ లో ఆసీనులై వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి. లోకాయుక్త రిజిస్ట్రార్ విజయలక్ష్మి, లోకాయుక్త ఐజి నరసింహారెడ్డి, డైరెక్టర్ లీగల్ వెంకటేశ్వర రెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్ పోలయ్య, డిప్యూటీ డైరెక్టర్ లీగల్ మురళీ మోహన్ రెడ్డి, లోకాయుక్త సంస్థ డీఎస్పీలు పాల్గొన్నారు. లోకాయుక్త సంస్థ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి.

లోకాయుక్త ను హైదరాబాద్ నుంచి పూర్తిగా కర్నూలుకు తరలించామన్నారు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి. కర్నూలు నుంచే లోకాయుక్త కార్యకలాపాలు నిర్వహిస్తాం.ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తాం. ప్రభుత్వం, అధికారులు నుంచి పని జరగకుంటే ఫిర్యాదు చేయొచ్చు. సరైన కారణంతో అధికారుల పై ఫిర్యాదు చేయవచ్చన్నారు. రెవెన్యూ అధికారులపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.

రెవెన్యూ అధికారుల వల్ల రైతులు, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. సమస్యలు నెల రోజుల తర్వాత పరిష్కారం కాకుంటే తమకు ఫిర్యాదు చేయవచ్చు… విచారణ చేపట్టి చర్యలకు సిఫార్సు చేస్తాం. అవసరమైతే మేమే శిక్షలు ఖరారు చేసి ప్రభుత్వానికి నివేదిస్తాం. కర్నూల్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో చాలా అవినీతి జరిగింది. కొంతమంది అధికారులు సస్పెండ్ అయ్యారు. మేము ఇచ్చిన సూచనలు ప్రభుత్వ పాటించకుంటే నేరుగా గవర్నర్ దృష్టికి తీసుకెళతాం. రిటైరయిన అధికారుల పైన కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరాం. చెరువులు, కుంటలు, సంబంధించి పట్టాలు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు సుప్రీం కోర్ట్ చెప్పింది. అయినా సరే అధికారులు వాటికి పట్టాలు ఇస్తున్నారన్నారు.

Read Also: Anil vs Kakani: మంత్రి అడ్డాలో మాజీ మంత్రి హల్ చల్