కాకినాడ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ డెడ్ బాడీ కలకలం రేపుతోంది? అసలేం జరిగిందనేది హాట్ టాపిక్ అవుతోంది. మృతుడు సుబ్రహ్మణ్యం భార్య తో ఫోన్ లో మాట్లాడారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో అధికారపార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారులో డ్రైవర్ మృతదేహం కలకలం రేపుతోంది. మృతదేహం ఎమ్మెల్సీ దగ్గర పనిచేసే డ్రైవర్ సుబ్రమణ్యంది గుర్తించారు. గురువారం ఉదయం ఎమ్మెల్సీ ఉదయ్ బాబు తనతో పాటు డ్రైవర్‌ను బయటకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రమాదం జరిగిందని డ్రైవర్ తమ్ముడికి ఉదయ్ బాబు సమాచారమిచ్చారు.శుక్రవారం తెల్లవారుజామున 2గంటలకు తన కారులోనే మృతదేహాన్ని ఎమ్మెల్సీ ఉదయ్‌బాబు తీసుకొచ్చి అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ డెడ్ బాడీని తీసుకోవడానికి మృతుడి బంధువులు నిరాకరించారు.
అనంతరం వేరే కారులో ఎమ్మెల్సీ వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐదేళ్లుగా ఎమ్మెల్సీ వద్ద సుబ్రహ్మణ్యం డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. డ్రైవర్‌ను హత్య చేశారంటూ ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసుల మృతదేహాన్ని పరిశీలించి కుటుంబసభ్యులతో మాట్లాడారు. 20 వేలు ఎమ్మెల్సీ అనంత బాబు కి ఇవ్వాలని, డబ్బులు ఇవ్వక పోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అనుమానాస్పద స్థితిలో ఉదయబాబు కారునుంచి సుబ్రహ్మణ్యం డెడ్ బాడీ వుండడంతో కుటుంబీకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం సుబ్రహ్మణ్యంకు వివాహం జరిగింది. సుబ్రహ్మణ్యం భార్య గర్భవతి, రాత్రి ఫోన్ లో మాట్లాడాడు, పుట్టింటి దగ్గర ఉంది. కారులో మృతదేహాన్ని తీసుకుని వచ్చి దింపమని చెప్పిన ఉదయ బాబు. నిరాకరించి కారుకు అడ్డము గా పడుకున్న కుటుంబ సభ్యులు. దాంతో వేరే కారు లో వెళ్ళిపోయారు ఉదయబాబు. ఈ ఘటనపై విపక్షాలు మండిపడుతున్నాయి.