AP-Telangana: వాతావరణంలో మార్పు.. ఏపీ, తెలంగాణలో తేలికపాటి వర్షాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP-Telangana: రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో మోస్తారు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఏపీలోని కొన్ని చోట్ల కూడా వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. వాతావరణంలో మార్పులు రానున్నాయని, రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కొన్ని ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉంటుందని అంచనా. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 2 వరకు వర్షాలు కురుస్తాయని.. సెప్టెంబర్ 3 తర్వాత రాష్ట్రంలో మళ్లీ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అయితే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో సకాలంలో వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని పలువురు రైతులు వాపోతున్నారు.
Read also: Astrology: ఆగస్టు 26, శనివారం దినఫలాలు
Also Read
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు..
రానున్న నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతామరాజు, కాకినాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు దిగువ ట్రోపో ప్రాంతంలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఈ గాలుల ప్రభావంతో ఈరోజు ఉత్తర, దక్షిణ కోస్తా ఆంధ్రాలో పలుచోట్ల, ఆదివారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంతుందంటే?
తాజావార్తలు
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!