బడ్జెట్లో ఏపీకి తీవ్ర అన్యాయం.. వామపక్షాల నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష నేతలు నిరసన తెలిపారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగింది. విభజన హామీలు ఏ ఒక్కదాన్నీ నెరవేర్చలేదు.ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్, మెట్రోరైలు వంటివి ప్రస్తావనే లేదన్నారు సీపీఎం నేతలు.
కేంద్ర బడ్జెట్లో ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందంటూ సీపీఐ నేతలు నిరసన తెలిపారు. బడ్జెట్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రస్తావన లేకపోవడంపై ఆగ్రహం చెందారు. విశాఖ సీపీఐ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. రైల్వే స్టేషన్ వద్ద ధర్నా చేపట్టారు సీపీఐ నాయకులు, కార్యకర్తలు.
Also Read
- Nara Lokesh : రాజకీయాల్లో 13 ఏళ్ల ప్రయాణం.. ఉద్యోగాలు, విద్యే లక్ష్యమన్న నారా లోకేష్
- YS Jagan : కుల గణనకు జగన్ మద్దతు.. 2027 లెక్కల్లో కీలక మార్పులు చేయాలని డిమాండ్
- Uppada Kothapalli : ఉప్పాడ కొత్తపల్లి ఎంపీపీ ఎన్నిక రేపటికి వాయిదా.. ఇరువర్గాల ఆందోళనతో ఉద్రిక్తత
- Vipperla TDP Clash : పోలీస్ స్టేషన్ వద్ద పెట్రోల్‌తో మహిళ హల్చల్.. విప్పర్లలో టీడీపీ వర్గపోరు!
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ఈ బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి మొండిచేయి చూపించారన్నారు. విశాఖ రైల్వే జోన్ కి సంబంధించి ఎటువంటి ప్రస్తావన లేదు . రైల్వేస్ పరంగా ఏపీకి ఎటువంటి కేటాయింపులు లేవు.
ప్రధాని హోదాలో మోడీ రైల్వే జోన్ పై విశాఖలో హామీ ఇచ్చారు. ఓఎస్డీని పెట్టి మూడేళ్లవుతున్నా ఎటువంటి కేటాయింపులు లేకుండా తాత్సారం చేస్తున్నారు. కార్పొరేట్ రంగానికి అనేక రాయితీలు ఇచ్చారు కాబట్టే నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పరుగులు పెట్టిందన్నారు.రైల్వేజోన్ కి సంబంధించి కలిసొచ్చే వారందరితో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామన్నారు.కార్పొరేట్ వ్యక్తులకు మేలు చేసే విధంగా బడ్జెట్ ఉందన్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో మరో అద్భుత ఘట్టం.. కనులపండువగా లక్ష్మీనృసింహుడి కల్యాణం
-
Rahul Gandhi: ఎన్నికల బహిష్కరణపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు!
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!