Site icon NTV Telugu

Laxmi Parvathy: దమ్ముంటే టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి

Ll1

Ll1

ఏపీలో ఇంకా ఎన్నికలకు టైం వున్నా.. అధికార. విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ, పార్టీ అధినేత చంద్రబాబు నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. యాభై వేల మంది వచ్చిన మహానాడు ప్రజా విజయం కాదు. మా పార్టీ మంత్రులు బస్సు యాత్రకు వెళ్తే లక్షల మంది జనం వస్తున్నారన్నారు.

మీకు నిజంగా ప్రజా బలం ఉంటే ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేయాలి. మీకు బలం పెరిగిందని నమ్మకముంటే టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామాలు చేసి పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మీ ఆటలు సాగవు.. అన్ని విషయాలు అందరికీ తెలుస్తున్నాయి. టీడీపీ మొత్తం చంద్రబాబు చేతిలోకి వచ్చాక మహిళలను ఘోరంగా అవమానిస్తున్నారు..

లోకేష్ వచ్చాక తెలుగుదేశంలో సంస్కారం మొత్తం మార్చేశాడు. చంద్రబాబు ముసలివాడై పోయాడు.. కొడుకు ఓ మూలన కూర్చోబెట్టాడు. లోకేష్ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని మహిళలను కించ పరుస్తున్నారు. టీడీపీకి చివరి రోజులు వచ్చేశాయి. ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ వేరు.. ఇప్పుడున్న టీడీపీ వేరు. మహానాడులో ఏ తీర్మానాలు లేకుండా పోయాయన్నారు లక్ష్మీపార్వతి. మొదటి నుంచీ లక్ష్మీపార్వతి చంద్రబాబుపై విమర్శలు చేస్తూనే వున్నారు. వైసీపీలోకి వెళ్లాక ఆమె స్వరం పెరిగింది. ప్రతి అంశంపై ఆమె స్పందిస్తున్నారు.

Somu Veerraju: అంబటి లెక్కలు తప్పుల తడక

Exit mobile version