NTV Telugu Site icon

KVP Ramachandra Rao: జగన్‌కు ఎందుకు దూరంగా ఉన్నానంటే..? సమాధానం చెప్పాల్సిందే..

Kvp 2

Kvp 2

KVP Ramachandra Rao: దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావును వైఎస్‌ ఆత్మగా పిలిచేవారు.. అయితే, వైఎస్సార్‌ కన్నుమూసిన తర్వాత ఆయన కుమారుడు వైఎస్‌ జగన్‌తో కేవీపీకి సంబంధాలు లేవు.. ఇవాళ విజయవాడలో మీట్‌ది ప్రెస్‌లో ఇదే ప్రశ్న కేవీపీకి ఎదురైంది.. దీనిపై స్పందిస్తూ.. వైఎస్సార్‌కు దగ్గరగా ఉన్న నేను జగన్‌కు ఎందుకు దూరమయ్యాననే అంశంపై ఇప్పుడు సమాధానం చెప్పబోనన్నారు.. కానీ, ఈ ప్రశ్నల నుంచి ఎంతో కాలం దూరం జరగలేను.. ఏదో ఒక రోజు సమాధానం చెప్పాల్సిందే.. మరో రోజు ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు వివరిస్తానని తెలిపారు కేవీపీ.. దీంతో, ఆయన ప్రత్యేకంగా వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్‌ జగన్‌ సంబంధాలపై ఏర్పాటు చేసే ఆ ప్రెస్‌మీట్‌లో ఏం చెప్పబోతున్నారు అనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.

Read Also: Mahesh Babu: #SSMB28 షూటింగ్ బ్రేక్… సంక్రాంతి వరకూ టైం ఉంది కదా…

మరోవైపు.. బీజేపీ-వైసీపీ సంబంధాలపై సీరియస్‌గానే స్పందించారు కేవీపీ.. బీజేపీని వైసీపీ ఎందుకు ప్రశ్నించ లేకపోతుందో నాకు కారణం తెలియదన్న ఆయన.. ప్రత్యేక పరిస్థితులని చెప్పిన నేనే.. ఆ ప్రత్యేక పరిస్థితులేంటో తెలియదని చెబుతున్నాను అన్నారు.. ఇక, చంద్రబాబుపై విరుచుకుపడ్డారు కేవీపీ.. 2018లో టీడీపీతో పొత్తు పెట్టుకోవడాన్ని నేను వ్యతిరేకించా.. ఈ విషయం ఇప్పటి వరకూ ఎక్కడా చెప్పలేదు. టీడీపీతో పొత్తు నచ్చకున్నా.. క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నోరు మెదపలేదన్నారు. ఆనాడు నేనెక్కడా ప్రచారంలో పాల్గొనలేదు. ప్రత్యేక హోదా అక్కర్లేదు.. ప్యాకేజీ చాలంటూ చంద్రబాబు ఏపీకి మరణ శాసనం రాశారని.. ఆ తర్వాత ప్రత్యేక హోదా గురించి దీక్ష చేయడం చంద్రబాబు వల్లే సాధ్యమైంది అంటూ మండిపడ్డారు. 2016లో రాహుల్ గాంధీ మీద రాళ్లేయించిన చంద్రబాబు.. 2018లో తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని.. ఎన్టీఆర్ కోసం 1984లో పోరాటం చేసి.. అదే ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి బయటకి పంపిన ఘనుడు చంద్రబాబు అంటూ ఫైర్‌ అయ్యారు.

Read Also: YS Sharmila: బండి సంజయ్, రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్.. ఏం మాట్లాడారంటే?

వైఎస్ తవ్వించిన కాల్వల నుంచి నీరు పారించి.. మొత్తం నేనే చేశానని చెప్పుకునే ఘనుడు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు కేవీపీ.. సెల్ ఫోన్లు తెచ్చిన సమర్ధుడు చంద్రబాబు. జాతీయ స్థాయిలో రాజకీయాలు చేసే చంద్రబాబు.. రాహుల్ లోక్ సభ సభ్యత్వం రద్దు విషయంలో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు ఇక్కడ కూర్చొని ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం దేనికి.. ఢిల్లీకి వచ్చి పోరాడాలని సూచించారు. చంద్రబాబుకు జేడీఎస్ తో ఇప్పటికే మంచి పరిచయాలు ఉన్నాయని గుర్తుచేశారు.. ఏపీలో మురికి కాల్వల్లో అవినీతి గురించి మాట్లడడానికే చంద్రబాబు పరిమితం కాకూడదు అంతూ హితవు పలికారు కేవీపీ రామచంద్రరావు.