Site icon NTV Telugu

YSRCP vs TDP: టీడీపీకి చెందిన పెళ్లి బృందంపై వైసీపీ కార్యకర్తల దాడి..!

Attack

Attack

YSRCP vs TDP: కర్నూలు జిల్లా కోసిగిలో పెళ్లి బృందంపై వైసీపీ రౌడీ మూకలు దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు.. ఏకంగా టీడీపీ సానుభూతిపరుల పెళ్లి ఊరేగింపులో.. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి. మహిళలు మెడలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు వైసీపీ శ్రేణులు లాగేసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు..

Read Also: Virat Kohli: మూడు ఫైనల్స్‌ ఆడిన ఆర్సీబీ.. విరాట్‌ కోహ్లీ ఎన్ని రన్స్ చేశాడో తెలుసా?

కర్నూలు జిల్లా కోసిగిలో జరిగిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కోసిగి 3వ వార్డు కాసేమ్మగడ్డ దగ్గర వైసీపీ ఎంపీపీ ఈరన్న అనుచరులు.. పెండేకంటి భాస్కర్ భార్య, కుమారులు పెండేకంటి ఆనందమ్మ, లోకారెడ్డి మరి కొందరు సుమారు 50 మందికి పైగా పెళ్లి ఉరేగింపుపై మూకుమ్మడిగా దాడి చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అనుచర్ల ఇంటిముందు వెళుతున్న టీడీపీ నాయకుడు పోతుల తాయన్న కుమారుడు పెళ్లి ఉరేగింపుపై మూకుమ్మడిగా దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. మహిళల మెడలో ఉన్న బంగారం వెండి వస్తువులను వైసీపీ శ్రేణులు లాగేసుకున్నారని బాధితులు తెలిపారు. పోలీసులకు సమాచారం అందించండంతో ఘటనా స్థలానికి చేరుకొని వైసీపీ శ్రేణులను చదరగొట్టారు అనంతరం బాధితులు పోతుల నరసమ్మ తాయన్న ఫిర్యాదు మేరకు వైసీపీకి చెందిన 11 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు..

Exit mobile version