Allagadda Politics: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియను వివాదాలు చుట్టుకుంటున్నాయా..? అంటే అవును అన్నట్టుగానే ఉంది పరిస్థితి.. మొన్న నంద్యాలలో విజయ డైరీ చైర్మన్ తో వివాదం, నిన్న విజయ డైరీ చైర్మన్ రియాక్షన్, ఇవాళ భూమా అఖిల సోదరుడు భూమా విఖ్యాత హాట్ కామెంట్స్, మరో వైపు టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డి ఆళ్లగడ్డలో ఎంట్రీతో ఆళ్లగడ్డలో హైటెన్షన్ మొదలైంది.. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల రాజకీయ దూకుడుతో నిప్పు రాజేస్తున్నారా.. నంద్యాలలో విజయ డైరీ ఆఫీస్ కి వెళ్లి ఎన్టీఆర్ శిలాఫలకం మూలన పదేశారని, మాజీ చైర్మన్ జగన్ ఫోటో పెట్టి ప్రస్తుత సీఎం చంద్రబాబు ఫోటోలు లేకుండా చేయడం వంటి అంశాలు ప్రస్తావిస్తూ విజయ డైరీ చైర్మన్ ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి తో వాగ్వాదంతో రాజకీయాలను హీటెక్కించారు. అందుకు ఎస్వీ జగన్ మోహన్ రెడ్డి స్పందించి భూమా అఖిలపై స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం, అంతే స్థాయిలోనే భూమా అఖిల సోదరుడు భూమా విఖ్యాత్ రెడ్డి ఎస్వీ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో నంద్యాల, ఆళ్లగడ్డలో కాస్త రాజకీయంగా టెన్షన్ వాతావరణం నెలకొంది.
Read Also: IND vs NZ: న్యూజిలాండ్‌తో సిరీస్.. హర్మన్‌ప్రీత్‌కే కెప్టెన్సీ! నలుగురు కొత్త ప్లేయర్లకు చోటు
ఇక, ఈ నేపథ్యంలో ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డకు వెళ్లడం, పోలీసులు పిలిపించి ఏవి సుబ్బారెడ్డిని ఆళ్లగడ్డ నుంచి వెళ్లాలని, సమస్యలు తలెత్తకుండా ఆంక్షలు విధించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భూమా అఖిల ఇంటి వద్ద, ఏవీ సుబ్బారెడ్డి ఇంటివద్ద భారీగా పోలీసులు మోహరించడంతో ఏమి జరుగుతుందోనన్న ఆందోళన స్థానికుల్లో నెలకొంది. ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డ నుంచి వెళ్లిపోవాలని, ఇక్కడ ఉంటే సమస్యలు వస్తాయని ఒత్తిడి చేయకుండానే నచ్చచెప్పడం ద్వారా పంపించే ప్రయత్నం చేసారని సమాచారం. అయితే, ఆళ్లగడ్డలో తనకు ఆస్తులు ఉన్నాయని, వాటిని కాపాడుకునేందుకు, వ్యాపార లావాదేవీలు చూసుకునేందుకు ఆళ్లగడ్డకు రాకుండా ఎలా ఉంటానని ఏవీ సుబ్బారెడ్డి చెప్పినట్టు తెలుస్తోంది. ఏవీ సుబ్బారెడ్డి ని ఆళ్లగడ్డకు రావద్దని చెప్పడానికి బలమైన కారణం లేదంటూనే స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడి నుంచి వెళ్లాలని నచ్చ చెప్పే ప్రయత్నం చేసారని తెలుస్తోంది.
Read Also: TDLP Meeting: నేడు టీడీఎల్పీ సమావేశం.. కీలక సూచనలు చేయనున్న సీఎం చంద్రబాబు
ఈ మొత్తం వ్యవహారం వెనుక భూమా అఖిల ఒత్తిడి ఉందని, ఏవీ సుబ్బారెడ్డిని స్థానికంగా లేకుండా చేయడానికి ఇలా చేస్తున్నారనేది ఏవీ సుబ్బారెడ్డి వర్గీయుల వాదన. అయితే ఈ విషయంపై అటు భూమా అఖిల కానీ, ఏవీ సుబ్బారెడ్డి కానీ పెదవి విప్పలేదు. సుబ్బారెడ్డి ని ఆళ్లగడ్డలో వుండకూడదని భూమా అఖిల చెప్పలేదని ఆమె వర్గీయులు చెబుతున్నారు. కేవలం ఏవీ సుబ్బారెడ్డి తన ప్రచారం కోసం సృష్టించుకుంటున్నారని భూమా అఖిల వర్గీయుల వాదన. ఏవీ సుబ్బారెడ్డి మీడియా సమావేశం ఉందని సమాచారం ఇచ్చి ఆ తరువాత మళ్లీ క్యాన్సిల్ చేశారు. మొత్తంగా నంద్యాల, ఆళ్లగడ్డలో ఈ పరిణామాలతో రాజకీయం వేడెక్కింది. సమీప బంధువులు, ఆత్మీయులుగా ఉన్నవారే ఇపుడు రాజకీయంగా విబేధించి పరస్పరం మాటల దాడి చేసుకుంటున్నారు.