Site icon NTV Telugu

Andhra Pradesh: హైస్కూల్‌ గ్రౌండ్‌లో పడిన పిడుగు.. ఇద్దరు విద్యార్థులు మృతి

Lightning Strikes

Lightning Strikes

Andhra Pradesh: హైస్కూల్‌ గ్రౌండ్‌లో విద్యార్థులు అంతా సరదాగా క్రికెట్‌ ఆడుతుండగా.. జరిగిన ఓ ఘటన ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసింది.. కర్నూలు జిల్లాలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కౌతాళం మండలం కాత్రికిలో పిడుగు పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలు అయ్యాయి.. విద్యార్థుల మృతదేహాలను ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు.. హైస్కూల్ గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.. కాగా, ఇటు ఏపీతో పాటు.. అటు తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి.. ఈ సమయంలో.. పిడుగులు పడి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.. ఇక, మూగ జీవాలు కూడా పిడుగుపాటుకు మృత్యువాత పడుతున్నాయి.. అయితే, వర్షాలు పడుతోన్న సమయంలో.. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో.. చెట్లకు దూరంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తోన్న విషయం విదితమే..

Read Also: CM Siddaramiah: ‘‘పాకిస్తాన్ రత్న’’.. పాకిస్తాన్‌లో సంచలనంగా సిద్ధరాయమ్య కామెంట్స్..

Exit mobile version