NTV Telugu Site icon

Tungabhadra Dam: తుంగభద్రకు పోటెత్తిన భారీ వరద.. గేట్లు ఎత్తివేత

Tungabhadra Dam

Tungabhadra Dam

Tungabhadra Dam: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.. దీంతో.. తుంగభద్ర జలాశయానికి భారీ వరద పోటెత్తింది.. పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా.. ఇప్పటికే తుంగభద్ర నీటి మట్టం 1628.09 అడుగులకు చేరింది.. ఇక, ఇన్ ఫ్లో రూపంలో 1,01,993 క్యూసెక్కుల నీరు వచ్చి తుంగభద్ర డ్యామ్‌లో చేరుతోంది.. దీంతో.. అప్రమత్తమైన అధికారులు.. ప్రాజెక్టులోని 3 గేట్ల ద్వారా దిగవకు నీటిని విడుదల చేస్తున్నారు.. దీంతో.. తుంగభద్ర జలాశయం నుంచి 7,744 క్యూ సెక్కుల నీరు ఔట్‌ఫ్లో రూపంలో దిగివ ప్రాంతానికి వెళ్లిపోతోంది.. మరోవైపు.. తుంగభద్ర పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 87.056 టీఎంసీలుగా ఉందని అధికారులు చెబుతున్నారు..

Read Also: Tummala Nageswara Rao: సాధ్యమైనంత త్వరగా అమలు చేస్తాం.. రెండో విడత రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు

ఇక, తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డ్యామ్ అధికారులు హెచ్చరించారు.. ఎగవ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద ప్రవాహం కొనసాగుతోన్న నేపథ్యంలో.. ప్రాజెక్టులోని మరికొన్ని గేట్లను కూడా ఎత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో.. హస్‌పేట బళ్లారితో పాటు కర్నూలు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.. నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. కృష్ణా నది ఉపనదిగా ఉన్న తుంగ‌భ‌ద్ర డ్యాం గేట్లు తెర‌వ‌డంతో.. కృష్ణా న‌దిలోకి వ‌ర‌ద పోటెత్తింది.. దీంతో.. దిగువన ఉన్న శ్రీశైలం డ్యామ్‌ వైపు కృష్ణమ్మ ప‌రుగులు పెడుతోంది. ఈ నేపథ్యంలో.. శ్రీశైలం డ్యామ్‌ మరింత వేగంగా నిండే అవకాశాలు ఉన్నాయి.