CM Chandrababu: ఆలయ ప్రసాదాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోన్న సమయంలో.. కర్నూలు పర్యటనలో కీలక కామెంట్లు చేశారు.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఐదేళ్లు ఆలయాల్లో కల్తీ నెయ్యితో ప్రసాదాలు పంచారని ఆరోపించారు.. శ్రీశైలం ప్రసాదంలోనూ కల్తీ జరిగిందన్న ఆయన.. బాత్‌రూమ్‌లు క్లీన్ చేసే కెమికల్స్‌తో తిరుమల లడ్డూ తయారు చేశారని కీలక వ్యాఖ్యలు చేవారు.. NDDB నివేదిక ఆధారంగానే మాట్లాడుతున్నాను అన్నారు.. అయితే, సీబీఐ, సిట్ క్లీన్‌చిట్ ఇచ్చినట్లు మాట్లాడుతున్నారు.. కానీ, కల్తీ జరిగినట్టు సిట్ రిపోర్టులో ఉందని వైవీ సుబ్బారెడ్డే చెప్పారని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు ..
Read Also: Bhumika : రాత్రంతా నిద్రపోలేదు..స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న భూమిక..
ఐదేళ్ల పాటు తిరుమలలో లడ్డూలకు ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. బాత్‌రూమ్‌లు శుభ్రం చేసే రసాయనాలు, కూరగాయల్లో వాడే రసాయనాలతో నెయ్యి కల్తీ చేశారని చెప్పారు. శ్రీశైలంలో కూడా ఇదే పరిస్థితి ఉందన్నారు. రిపోర్ట్‌లో ఎనిమల్ ఫ్యాట్ ఉందని తేలితే అదే నిజాన్ని చెప్పానని స్పష్టం చేశారు. గతంలో లడ్డూ రుచి, ఇప్పటి లడ్డూ రుచి ఒకటేనా కాదా ప్రజలే చెప్పాలని ప్రశ్నించారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడాలని అడిగితే సహించరా అని మండిపడ్డారు చంద్రబాబు..
తీవ్రవాదులతో పోరాడిన సందర్భంలో తనపై 24 క్లేమోర్ మైన్స్ పేల్చారని చంద్రబాబు వెల్లడించారు. అయినా వెంకటేశ్వర స్వామి తనను కాపాడారని చెప్పారు. ఇక, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తనపై అనవసరంగా “నరాసుర రక్త చరిత్ర” అంటూ రాశారని, ఇప్పుడు తనను అపాలజీ చెప్పమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు, గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లడానికి 6 గంటలు పడుతోందని, ఆ రోడ్డుపై ఇంకెవరూ వెళ్లకూడదా అని ప్రశ్నించారు. రౌడీయిజం, గుండాయిజం చేస్తూ బలప్రదర్శన చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు సీఎం చంద్రబాబు..
