Kurnool Market Yard: ఓ వైపు బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలు మండిపోతుంటే.. మరోవైపు.. కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి నిల్వలు పేరుకుపోతున్నాయి.. వారంలో 3 రోజులు మాత్రమే ఉల్లి కొనుగోళ్లు చేయడంతో మరింత పేరుకుపోయాయి ఉల్లి నిల్వలు.. దీంతో, ఉల్లి అమ్ముకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు రైతులు.. అర్ధరాత్రి 12 గంటలవరకు మార్కెట్ యార్డులోకి ఉల్లి లారీలు అనుమతించలేదు అధికారులు.. 8 గంటలు రోడ్డుపైనే ఉల్లి లారీలు నిలపాల్సిన పరిస్థితి.. రాత్రి కిలోమీటర్ పొడవునా ఉల్లి లోడ్‌తో వచ్చిన లారీలు నిలిచిపోయాయి.. ఉల్లి అమ్ముకోవడానికి రైతులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి దాపురించింది. అయితే, వారంలో 3 రోజులు కొనుగోళ్ల నిర్ణయంపై రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు.. ఉల్లికి డిమాండ్ వున్నా, ధర వున్నా అధికారుల తీరుతో రైతులకు కష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read Also: PM Modi : రెండ్రోజుల పాటు గుజరాత్ పర్యటనలో మోదీ.. వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం
ఉల్లికి ఎక్కువగా మార్కెట్ కు వస్తే సమస్య తలెత్తకుండా పరిష్కారం చేయడంలో అధికారులు విఫలం అయ్యారని రైతులు మండిపడుతున్నారు.. 10 రోజులుగా ఉల్లి రైతుల సమస్య పరిష్కరించకుండా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తు్నారు.. అయితే, క్వింటాలు ఉల్లి 2 వేల నుంచి 4,600 వరకు ధర పలుకుతోంది.. కానీ, కొనుగోలులో జాప్యంతో ఉల్లి మురిగిపోయి రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.. మరోవైపు.. నాణ్యత దెబ్బతిన్న ఉల్లిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు వ్యాపారులు.. మొత్తంగా పంటను మార్కెట్ యార్డులో అమ్మేందుకు తీసుకెళ్లిన రైతన్నలు.. లోపల స్థలం లేకపోవడంతో రోడ్లపై నిలిపివేశారు. దీంతో గంటల తరబడి రైతులు.. రోడ్లపైనే పడిగాపులు పడుతున్నారు. తమ వద్ద తిండికి సైతం పైసలు లేవని… వేగంగా పంటను లోపలకు తీసుకెళ్లేందుకు వీలు కల్పించాలని రైతులు కోరుతున్నారు.
Read Also: Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
నిజానికి అర్థరాత్రి 12 గంటల నుంచి మార్కెట్ యార్డులోకి ఉల్లిపంటకు అనుమతి ఉంది. వారంలో మూడురోజులే ఉల్లి అమ్మకాలు.. కొనుగోళ్లు ఉండడంతో అధికంగా సరుకువచ్చింది. మార్కెట్‌లో స్థలం లేకపోవడంతో రోడ్డు మీదే ఉల్లి లారీలు నిలిచిపోయాయి. ఫలితంగా తీవ్రమైన లోపల ఉల్లి కొనుగోళ్లు వేగవంతం చేస్తే.. యార్డులో స్థలం దొరుకుతుందని, తాము పంటను విక్రయించుకుంటామంటున్నారు దీనికి తోడు మార్కెట్‌లోనూ ధరలు రోజుకోరకంగా ఉంటున్నాయి. అయితే బయట మరీ క్వింటా 3వేలు లోపల పలుకుతుండడంతో..రైతులు మార్కెట్ లోపల అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మార్కెట్ యార్డు బయట ఎదురవుతున్న పరిస్థితులు వారికి పరీక్ష పెడుతుండడంతో.. పగోడికి కూడా ఇలాంటి కష్టాలు రావొద్దని కోరుకుంటున్నారు.