Devaragattu Bunny Festival: కర్నూలు జిల్లా దేవరగట్టులో పోలీసులు భారీగా మోహరించారు. మాలమల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం, బన్నీ ఉత్సవానికి 800 మంది పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. హళగొంద మండలం దేవరగట్టు కొండ ప్రాంతంలో స్వయంబుగా వెలిసిన మాళ మల్లేశ్వర స్వామి దేవాలయంలో విజయదశమి రోజు ఆర్ధరాత్రి జరిగే బన్నీ ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పటికే 148 మందిపై బైండోవర్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు 100 నైట్ విజన్ సీసీ కెమెరాలు, 700 ఎల్ఈడీ లైట్లు అమర్చారు. 5 డ్రోన్ కెమెరాలతో నిఘా కొనసాగనుంది.
Read Also: Janaka Aithe Ganaka Review: జనక అయితే గనక రివ్యూ.. సూహాస్ హిట్ కొట్టాడా?
కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరానికి సర్వం సిద్ధమైంది. ఇవాళ అర్థరాత్రి బన్నీ ఉత్సవం ఆపడం ఎవ్వరితరమూ కాదంటూ సవాల్ విసురుతున్నారు స్థానికులు. మరోవైపు కర్రల సమరం కట్టడికి పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అయితే భక్తుల సంప్రదాయం నెగ్గుతుందా? లేకపోతే ప్రభుత్వ ఆదేశాలు కచ్చితంగా అమలవుతాయా అనేది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. హింసకు తావులేకుండా బన్నీ ఉత్సవం నిర్వహించుకోవాలని అవగాహన సదస్సు నిర్వహించారు ఎస్పీ బిందు మాధవ్, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్. వారం రోజులుగా బన్నీ ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించిన ఉన్నతాధికారులు.. ఈ ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని సూచించారు.
Read Also: Off The Record : పడమరలో వైసీపీ సైడ్ ట్రాక్..కేడర్ ఉక్కిరిబిక్కిరి
మాల మల్లేశ్వర కళ్యాణోత్సవం అనంతరం జరిగే కర్రల సమరం ఎంతో చరిత్ర ఉందని స్థానికులు చెబుతున్నారు. త్రేతాయుగంలో మని, మల్లాసూరులు అనే రాక్షసులను కాల భైరవుడి అవతారంలో శివుడు అంతమొందిస్తాడు. రాక్షసులు ప్రాణాలు విడిచే సమయంలో తమకు ప్రతి ఏటా భక్తుల రక్తాన్ని ఓ కుండ నిండా సమర్పించాలని కోరుకున్నారట. అందుకు శివపార్వతులు అంగీకరించారని స్థలపురాణం చెబుతోంది. పిడికెడు రక్తం ఇచ్చేందుకు ఏటా రక్ష పడి వద్దకు వచ్చే భక్తులను గోరవయ్యాలు అడ్డుకునేయత్నం చేస్తారని ప్రతీతి. ఆ సమయంలో మాళమ్మ విగ్రహాన్ని తీసుకుని పూజారి దబనంతో తొడ నుంచి పిడికెడు రక్తం సమర్పిస్తారు. వెంటనే డిర్రు గో పరక్ అంటూ కేకలు వేస్తూ జరిగే బన్నీ జైత్రయాత్రలో కర్రలతో కొట్టుకుంటారు. దీంతో తలలు పగిలి రక్తం చిమ్ముతుంది.
Read Also: Israel-Labnon: లెబనాన్‌లోని ఐరాస కార్యాలయంపై దాడి.. భారత్ ఖండన
8 వందల అడుగుల ఎత్తులో కొలువుదీరిన పార్వతీ పరమేశ్వరులను దర్శించుకునేందుకు అర్థరాత్రి నెరణికి, నెరణికి తండా, కొత్తపేట, ఎల్లార్తి గ్రామాల ప్రజలు పాల బాస చేస్తారు. ఘర్షణలు లేకుండా కలసికట్టుగా ఉత్సవాలను విజయవంతం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున కర్రలు ,అగ్ని కాగడాలు చేత బూని శివ, పార్వతుల కల్యాణం జరిపిస్తారు. కల్యాణోత్సవం ముగిశాక ఉత్సవ మూర్తులను పల్లకిలో సింహాసనం కట్ట వద్దకు చేరుస్తారు. అప్పుడే కర్రల సమరం హోరాహోరీగా జరుగుతుంది. ఉత్సవ మూర్తులు తమ గ్రామనికే దక్కాలంటూ మూడు గ్రామాల భక్తులు కర్రలతో శబ్దం చేస్తూ పోటీ పడడంతో తలలు పగుల్తాయి. వెంటనే బండారు పూసుకుని అలాగే బన్నీ ఉత్సవంలో పాల్గొంటారు. గ్రామస్తులు దీనిని ఓ క్రీడగా భావిస్తున్నా కర్రల సమరం మాత్రం భీకరంగా జరుగుతుంది.
Read Also: Dussera 2024: దశమికి జమ్మి చెట్టుకి ఉన్న సంబంధం ఏమిటి..?
బన్నీ ఉత్సవానికి ముందు వచ్చిన అమావాస్య నుంచి భక్తులు దీక్ష చేపట్టి ఉత్సవాలు ముగిసేంతవరకు చాలా నిష్టతో ఉంటారు. కొండపై నుంచి విగ్రహాలు తిరిగి గ్రామానికి చేరేంతవరకు మద్యం, మాంసం ముట్టరు. దాంపత్య జీవితానికి దూరంగా ఉంటారు. 7 గ్రామాల ప్రజలు ఈ కట్టబాట్లు పాటిస్తారు. అయితే ఇతర గ్రామాల నుంచి కొంతమంది మద్యం సేవించి కర్రల సమరంలో పాల్గొంటుడడంతో హింసాత్మక ఘటనలు ఏటా చోటుచేసుకుంటున్నాయి. వందల మంది తలలు పగులుతున్నాయి. అయినా సరే కర్రల సమరం వీడట్లేదు స్థానికులు.