CM Chandranaidu: సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ ఇది ప్రారంభం మాత్రమే అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. కర్నూలులో ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ, గవర్నర్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నారా లోకేష్ సహా పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలతో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రజలందరూ ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు.. మీరు జీఎస్టీ 2.0తో లబ్ధి పొందుతున్నారా? లేదా? చెప్పాలంటూ సభకు హాజరైన ప్రజలను ప్రశ్నించి.. లబ్ధిపొందినవారు చప్పట్లు కొట్టాలంటూ వారిలో ఉత్సాహాన్ని నింపారు చంద్రబాబు..
Read Also: JFK Assassination Documents: ట్రంప్ రాజకీయ వ్యూహానికి పుతిన్ ఫైల్ బాంబు దెబ్బ..
అయితే, సూపర్ సేవింగ్స్ అనేది ప్రారంభం మాత్రమే.. రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలు ఉంటాయని వెల్లడించారు సీఎం చంద్రబాబు.. 25 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ.. సీఎంగా, పీఎంగా ప్రజా సేవలో ఉన్నారు. 21వ శతాబ్దం మోడీదే అవుతుందనడంలో సందేహం లేదని స్పష్టం చేశారు.. ఇక, సరైన సమయంలో ప్రధాని మోడీ.. దేశానికి సరైన నాయకుడిగా ఉన్నారని ప్రశంసలు కురిపించిన ఆయన.. ఇలాంటి నాయకుడు ఉండటం దేశం అదృష్టంగా అభివర్ణించారు.. చాలా మంది ప్రధానమంత్రులతో కలిసి పనిచేశారు.. కానీ, నరేంద్ర మోడీ లాంటి నాయకుడిని నేను చూడలేదని.. ఆయన విశ్రాంతి లేకుండా నిరంతరం పనిచేస్తూనే ఉన్నారని పేర్కొన్నారు చంద్రబాబు..
ఇక, 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంటుందని తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు.. నరేంద్ర మోడీ దృఢ సంకల్పంతో మనం 11వ స్థానం నుండి నాల్గో స్థానానికి ఎదిగామన్నారు.. మరోవైపు.. ఆపరేషన్ సిందూర్ మన సైనిక బలాన్ని నిరూపించింది.. మాటలతో కాదు.. చేతలతో చూపించే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.10 వేలు ఆదా అవుతుందని వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ సభా వేదికగా చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
