Site icon NTV Telugu

మళ్లీ రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలన వాయిదా..

KRMB

KRMB

కృష్ణానది జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి… ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు.. ఈ నేపథ్యంలో.. కృష్ణానది యాజమాన్యబోర్డు (కేఆర్‌ఎంబీ) రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించాల్సి ఉంది.. అయితే.. ఆ పర్యటన వాయిదా పటినట్టు ప్రకటించింది కేఆర్‌ఎంబీ.. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాల నేపథ్యంలో పర్యటన వాయిదా పడిందని అధికారులు వెల్లడించారు. మళ్లీ ఎప్పుడు పరిశీలన చేసేది తర్వాత వెల్లడిస్తామని కేఆర్‌ఎంబీ తెలిపింది. కాగా, ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకున్నా.. రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టిందని ఎన్జీటీలో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. దానిపై విచారించిన ఎన్జీటీ.. ప్రాజెక్టు పనులను పరిశీలించి పూర్తి నివేదిక ఇవ్వాలని కేఆర్ఎంబీని ఆదేశించింది. ఎన్జీటీ ఆదేశాలతో గతంలోనే ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లాలని కేఆర్ఎంబీ భావించింది.. ఆ మేరకు ఏపీ సర్కార్‌కు కూడా సమాచారం ఇచ్చింది.. కానీ, కరోనా విజృంభిస్తున్న సమయంలో పనుల పరిశీలన వద్దని చెబుతూ వచ్చింది ఏపీ.. కేఆర్ఎంబీలో తెలంగాణ అధికారులెవరూ ఉండకూడదని కూడా కోరింది.. అనంతరం ఆగస్టు 5న ప్రాజెక్టును పర్యటించాలని కేఆర్ఎంబీ భావించినా.. సాంకేతిక కారణాలతో ఎన్జీటీ ఆదేశాల మేరకు మళ్లీ పరిశీలన వాయిదా పడింది.

Exit mobile version