NTV Telugu Site icon

Perni Nani: మాజీ మంత్రి సంచలనం..! రప్పా.. రప్పా.. అనేది కాదు.. చీకట్లో కన్నుకొడితే అయిపోవాలి అంతే..!

Perni Nani

Perni Nani

Perni Nani: పుష్ప సినిమాలోని ‘రప్పా.. రప్పా..’ డైలాగ్‌ కాస్తా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ అయ్యింది.. వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీల్లో ఈ డైలాగ్‌ వాడడం.. ఆ డైలాగ్‌ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ నోటి వెంట.. ఆ తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్.. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు ఇలా.. రప్పా.. రప్పా.. రాజకీయాల్లో తిరిగేసింది.. అయితే, ఆ డైలాగ్‌ను గుర్తు చేస్తూనే.. మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారిపోయాయి..

Read Also: Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం!

కృష్ణా జిల్లాలో బాబు ష్యూరిటీ మోసం కార్యక్రమాల్లో మాజీ మంత్రి పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలు చర్చగా మారుతున్నాయి. పామర్రు, అవనిగడ్డ నియోజక వర్గాల్లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ మీటింగ్స్ లో పేర్ని నాని మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ మాదిరి.. మీరు కూడా చెడిపోయారా..? లోకేష్ రెడ్ బుక్ అంటే.. మీరు రప్పా రప్పా అంటున్నారు అన్నారు. ఏదైనా చేయాలంటే చీకట్లో కన్నుకొడితే అయిపోవాలి తప్ప రప్పా రప్పా అని అనటం కాదన్నారు. రప్పా రప్పా అనేది మెయిన్ కాదని.. అది చీకట్లో జరిగిపోవాలన్నారు.

Read Also: CM Revanth Reddy : అమెరికా – తెలంగాణ బంధం మరింత బలపడాలి

ఇక, ముల్లును ముళ్ళుతోనే తీయాలన్నారు పేర్ని నాని.. అంతే తప్ప పదే పదే రప్పా రప్పా అని వేలంవెర్రిగా మాట్లాడకూడదని కార్యకర్తలకు చెప్పారు. ప్రజల మనసుల్లో మన్ననలు పొందే విధంగా పనిచేయాలని.. ఇలా మాట్లాడితే ప్రజలు మన్నించరూ అన్నారు. అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన వారి సంగతి చూడాలని.. ఇప్పుడు ఈ మాటలు అవసరం లేదన్నారు. రప్పా రప్పా అని పదే పదే అంటే ప్రజలు మన్నించరన్నారు. లోకేష్ రెడ్ బుక్ చివరికి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వానికి ఉరి తాడు అవుతుందని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి పేర్నినాని..