NTV Telugu Site icon

Perni Nani: తాను చేసిన మంచి గురించి చెప్పే దమ్ము లేదు..! మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

Perni Nani

Perni Nani

టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తాను చేసిన మంచి గురించి చెప్పే దమ్ము లేదని ఆరోపించారు. కొంత మంది మాజీ అధికారులను ప్రభుత్వంపై విషం చిమ్మెలా ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. పీవీ రమేష్ ఐఏఎస్గా పని చేశాడు.. ఇంత దిగజారి ప్రవర్తించాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవీ రమేష్ తండ్రి సుబ్బారావు మాస్టర్ గారు కొందరు రైతులతో కలిసి ఉమ్మడిగా లీజుకు ఇచ్చారన్నారు. 70 ఎకరాల పొలాన్ని 20 ఏళ్ల క్రితమే చెరువు తవ్వి అందరితో కలిసి లీజుకు ఇస్తున్నారని పేర్ని నాని తెలిపారు. సరిహద్దులు లేని పీవీ రమేష్ పొలం ఇప్పటికే వివాదంలో ఉందని ఆయన ఆరోపించారు.

T20 World Cup 2024: భారత ఆటగాళ్లకు ఏమైంది.. ప్రపంచకప్‌కు ఎంపికయితే ఆడరా?

జనవరి నెలలో విన్నకోట గ్రామంలోని భూ వివాదంపై విచారణ చేసారు.. భూముల అస్సలు పత్రాలు తీసుకు రావాలని చెప్పిన ఇప్పటి వరకు పీవీ రమేష్ రాలేదని పేర్ని నాని తెలిపారు. అక్కడ రైతులకు పీవీ రమేష్ కి గొడవలు ఉంటే ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని వ్యాఖ్యానించారు. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్కు మీ భూమి వివాదానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఐఏఎస్గా పని చేసి విషం చిమ్మడం సమంజసమా అని పేర్కొన్నారు. చంద్రబాబు కోసం ట్వీట్స్ చేయడం దేనికి సంకేతం అన్నారు. విన్నకోట గ్రామం రండి.. వాస్తవాలు ఎంటో తెలుసుకోండని సూచించారు. మీ నాన్నగారు అప్పచెప్పిన ఆస్తిని ఈ వివాదంలోకి లాగుతారా అని పీవీ రమేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

BJP: ఇండియా కూటమి నేతలు పాకిస్తాన్‌కి మద్దతుగా మాట్లాడుతున్నారు.. 5 ఉదాహరణలు వివరించిన బీజేపీ..