NTV Telugu Site icon

Krishna: గన్నవరం పరిసర ప్రాంతాల్లో మరోసారి పులి సంచారం..!

Tiger

Tiger

గన్నవరం పరిసర ప్రాంతాల్లో మరోసారి పులి సంచారం కలకలం రేపుతుంది. పులి కదలికలపై స్థానికుల్లో భయాందోళనలు నెలకున్నాయి. ఇవాళ ఉదయం డ్యూటీకి వెళ్తున్న సమయంలో పులి రోడ్డు దాటడం చూసినట్టు ఆర్టీసీ కండక్టర్ రవి కిరణ్ చెబుతున్నాడు. ఆగిరిపల్లి మండలం కళ్ళుటూరు గ్రామానికి చెందిన ఆర్టీసీ కండక్టర్ బొకినల రవి కిరణ్ ఉదయం డ్యూటీకి వెళ్తుండగా పులిని చూశాడు. కండక్టర్ రవి ఇవాళ ఉదయం 3 గంటల సమయంలో గన్నవరంకు బైక్ పై డ్యూటీకి వెళ్తుండగా మార్గ మధ్యలో సగ్గురు, మెట్లపల్లి దారి మధ్యలో ఒక పులి పిల్లను చూసినట్టు చెబుతున్నాడు.

Read Also: Zimbabwe: సింహాలతో నిండి ఉన్న అడవిలో తప్పిపోయిన 8 ఏళ్ల బాలుడు.. ఎలా బయటపడ్డాడంటే..

వెంటనే ఈ విషయాన్ని కండక్టర్ రవి స్థానిక గ్రామస్థులకు సమాచారం అందించాడు. దీంతో.. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అసలు కండక్టర్ చూసింది పులి పిల్లా లేక ఏదైనా వేరే జంతువుని చూసి పులి పిల్లా అనుకొని భయపడ్డాడా..? అని పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే.. కొన్ని రోజుల క్రితం అడవి పందుల ఉచ్చులో పడి ఒక మగ పులి స్థానికంగా మృతి చెందిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా కండక్టర్ పులి పిల్లను చూశానని చెప్పటంతో అక్కడి ప్రజల్లో ఆందోళన నెలకొంది. అటవీ శాఖ అధికారులు పూర్తిగా ఈ విషయంపై దృష్టి పెట్టి మెట్లపల్లి సమీప ప్రాంతాల్లో ఏమైనా పులుల కదలికలపై స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.

Read Also: PM Modi: 8న విశాఖకు ప్రధాని మోడీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

Show comments