NTV Telugu Site icon

Perni Nani: మచిలీపట్నంలో ఉద్రిక్తత.. వైసీపీ ఆఫీస్ ర్యాంప్ కూల్చివేత.. పేర్నినాని సీరియస్!

Perni Nani

Perni Nani

Perni Nani: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ ఆఫీసు ఆక్రమణలో ఉందని కార్యాలయం ముందున్న ర్యాంప్ ను ప్రోక్లెయిన్ తో మున్సిపల్ అధికారులు పగలకొట్టారు. రేపు (మార్చ్ 13) వైసీపీ ఆవిర్భావ దినోత్సవం కోసం ఏర్పాట్లు చేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఇక, విషయం తెలుసుకుని సంఘటన ప్రదేశానికి వచ్చిన మాజీ మంత్రి పేర్ని నానినీ అధికారులు అడ్డుకున్నారు.

Read Also: Pak train hijack: పాకిస్తాన్ రైలు హైజాక్.. 150 మంది సైనికులు ఊచకోత..?

ఈ సందర్భంగా మాజీమంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. కొల్లు రవీంద్ర ఊరిని ఉద్దరిస్తాడని ఓటు వేస్తే చేస్తున్న పని ఇది అని మండిపడ్డారు. నడమంత్రపు అధికారంతో ఇలా చేస్తున్నారు.. ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు అని పేర్కొన్నారు. గోడకు నిచ్చెన వేసి పారిపోయే పిరికి పందలు లేరని చెప్పుకొచ్చారు. మా హక్కుల కోసం మేం పోరాటం చేస్తాం అని ఆయన వెల్లడించారు. మున్సిపల్ కమిషనర్ ప్రభుత్వ తొత్తుగా మారి ఇదంతా చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకారణంగా వైసీపీ కార్యాలయం ర్యాంప్ పగలకొట్టారు అని పేర్నినాని తెలిపారు.