NTV Telugu Site icon

MP Balasouri: పవన్తో ప్రయాణం చేయాలని డిసైడ్ అయ్యాను..

Balashouri

Balashouri

జనసేన పార్టీలో చేరుతున్నానని ఎంపీ బాలశౌరి మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు మోపిదేవిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. మీటింగ్ అనంతరం బాలశౌరి మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్ తో రెండు గంటలు సమావేశం అయినట్లు తెలిపారు. మంచి ఆలోచన ఉన్న వ్యక్తి పవన్ అని అన్నారు. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ది చేయాలి అనే ఆలోచన పవన్ కల్యాణ్ కు ఉందని ఎంపీ తెలిపారు.

Read Also: Pawan Kalyan: కొణతాల సేవలు పార్టీకి ఉపయోగకరం..

అంతేకాకుండా.. పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేస్తే రైతులకు ఉపయోగం అని పవన్ కల్యాణ్ చెప్పారన్నారు ఎంపీ బాలశౌరి. ఈ క్రమంలో.. పవన్ తో ప్రయాణం చేయాలని డిసైడ్ అయ్యానని.. మంచి డేట్ చూసుకుని పార్టీలో చేరతానన్నారు. కాగా.. జనసేన ద్వారా ప్రజలకు సేవ చేస్తానని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ ఎక్కడని అడగ్గా ఖచ్చితంగా మచిలీపట్నం, ఆల్రెడీ బందరు ఎంపీగా ఉన్నాను, అవనిగడ్డ తన గుండెల్లో ఉంటుంది అని చెప్పారు బాలశౌరి.

Read Also: Pawan Kalyan: అయోధ్య ప్రాణ ప్రతిష్ట.. లక్నోకు చేరుకున్న పవన్ కళ్యాణ్..