Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishna Delta Water Crisis: కృష్ణా డెల్టాలో సాగునీటి సమస్యపై వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన డెల్టా పరిధిలోని రైతుల పరిస్థితిని వివరించారు. కృష్ణా డెల్టాలో ఆరు లక్షలకు పైగా ఎకరాల ఆయకట్టు ఉన్నప్పటికీ, ఇప్పటికీ దాదాపు 50 నుంచి 55 వేల ఎకరాల్లో సాగు ప్రారంభం కాలేదని తెలిపారు. సాగు సమయం వచ్చినా నీరు అందక రైతులు పంటలు వేసుకోలేక పొలాలను ఖాళీగా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్ని నాని పేర్కొన్నారు. అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, తోట్లవల్లూరు, మచిలీపట్నం నార్త్ ప్రాంతాల్లో దాదాపు 90 శాతం వరకు సాగు జరగలేదని తెలిపారు. మచిలీపట్నం సౌత్‌లో కూడా సుమారు 40 శాతం భూములు ఇంకా సాగుకు దూరంగా ఉన్నాయని చెప్పారు.
గూడూరు, పెడన, బంటుమిల్లి, కృతివెన్ను ప్రాంతాల్లో దాదాపు 20 వేల ఎకరాల్లో ఇప్పటికీ సాగు ప్రారంభం కాలేదని పేర్ని నాని వివరించారు. గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు ప్రాంతాల్లో కూడా వందల ఎకరాలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. మొక్కలు నాటాల్సిన సమయంలో నీరు అందకపోవడంతో రైతులు పంటలు వేయలేకపోతున్నారని అన్నారు. సాగు ఆలస్యం కావడం వల్ల రైతుల పెట్టుబడులు పెరగడంతో పాటు దిగుబడులపైనా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పేర్ని నాని పేర్కొన్నారు. పంటలు వేసిన రైతుల్లో కూడా ఆందోళన కొనసాగుతోందన్నారు. పంటకు అవసరమైన కీలక సమయంలో నీరు అందకపోతే పంటలు ఎండిపోయి, రైతులు పెట్టిన మొత్తం పెట్టుబడి నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు.
Also Read
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
- Vallabhaneni Vamsi vs Yarlagadda Venkatrao: ఎమ్మెల్యే యార్లగడ్డకు వల్లభనేని లీగల్ నోటీసు
పులిచింతలలో నీటి నిల్వలు ఉన్నప్పటికీ కృష్ణా డెల్టాకు సాగునీరు అందడం లేదని పేర్ని నాని అన్నారు. నీరు ఎప్పుడు వస్తుందనే దానిపై స్పష్టత లేక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పారు. నీరు అందుబాటులో ఉన్నప్పటికీ రైతులకు చేరకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. కృష్ణా డెల్టాలో రైతుల సాగునీటి సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు. ఎక్కడెక్కడ సాగు జరగలేదో క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన నీటిని విడుదల చేసి రైతులు పంటలు వేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక, సాగునీటి సమస్య ప్రభావం రైతులకే పరిమితం కాదని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ కూలీలు, విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలపై ఆధారపడే గ్రామీణ కుటుంబాల ఉపాధిపైనా దీని ప్రభావం పడుతుందని తెలిపారు. అందువల్ల ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని కృష్ణా డెల్టాలో సాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు మాజీ మంత్రి పేర్ని నాని..
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
-
Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
-
Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
-
Dragon Update: ‘డ్రాగన్’ డెడ్‌లైన్ మిస్సైతే..!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!