NTV Telugu Site icon

Anantha Sriram: హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను తిరస్కరించాలి..

Anantha Sriram

Anantha Sriram

కృష్ణా జిల్లా కేసరపల్లిలో హైందవ శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌, వర్రే కోటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. బ్రహ్మాండ నాయకుడు అన్న పదం ఉందని ఒక సినీ దర్శకుడు కాదన్నాడని.. పాట వద్దన్నందుకు తాను అతనికి పాట రాయడం మానేసానని తెలిపారు. తాను లక్ష్యం సినిమాకు 12 నిమిషాల హిందూ పాట రాశాను.. లక్ష్యం కథ లాంటి కథ వస్తే మరల అలా పాటలు రాస్తానని అన్నారు. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలను తిరస్కరించాలని ఆయన చెప్పారు. అలాంటి సినిమాలకు మనం వెళ్ళకపోతే డబ్బులు రావు.. అలాంటి సినిమాలు తీయరని పేర్కొన్నారు. సత్యవాణిని అభినవ ద్రౌపదిగా వర్ణించారు.. ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. ధర్మరాజు అంతటి దాత అని కర్ణుడిని అంటే ఊరుకుంటారా.. అని అన్నారు. అందంగా ఉండటానికి చిత్రీకరణలో హైందవ హననాలు సినిమాలో జరిగాయని అనంత శ్రీరామ్ తెలిపారు. ఇస్కాన్ హరేకృష్ణ హరేకృష్ణను ఐటెం సాంగ్ చేసారు.. పీకే సినిమాలో రాయి మీద పాన్ ఉమ్మి దేవుడన్నారు… ఊరుకుంటారా‌.. అని ప్రశ్నించారు. అక్రమ్ హుస్సేన్ గోపికలను బట్టలు లేకుండా చూపిస్తే ఊరుకుంటారా.. అని అన్నారు. ఇన్ని విధాలుగా హననం చేస్తుంటే.. చూస్తూ కూచుంటారా.. తిరగబతారా… అని ప్రశ్నించారు.

Read Also: Bird flu: “బర్డ్ ఫ్లూ”‌తో 3 పులులు, ఒక చిరుత మృతి.. మహారాష్ట్రలో రెడ్ అలర్ట్..

వర్రే కోటేశ్వరరావు మాట్లాడుతూ.. మూడు రకాలుగా హిందువులు ఏపీలో నలిపివేయబడుతున్నారని అన్నారు. దేవాలయాలపై దాడులు చేస్తే మతిస్థిమితం లేని వాడి చర్యలు అంటున్నారు.. హిందూ సమాజం ఏదో ఒక రోజు మతిస్థిమితం కోల్పోతేనే ఏపీలో హిందూ గౌరవం నిలబడుతుందని తెలిపారు. హిందూ సమాజం ఏకీకృతం కావాలి.. మతిస్థిమితం లేని వాళ్ళు హిందూ దేవాలయాలపై దాడులు చేస్తే మనకు అమ్మవారు పూనతారన్నారు. దేవ దేవతలు అందరూ హిందువులపై ఒంటిమీదకు వస్తారని చెప్పారు. ఈ విషయం అర్ధమైతే హిందూ వ్యవస్ధలపై దాడులు జరగవు.. కేసులు ఉండవుని వర్రే నాగేశ్వరరావు తెలిపారు. ప్రతీ చోట హిందూ జట్టు తయారు కావాలి.. ఏ పోలీసు స్టేషన్‌కి వెళ్ళక్కర్లేకుండా, ఎవరిపై ఆధారపడకుండా మన సమస్యలు పరిష్కరించుకోవడానికి జట్టుగా మారాలని అన్నారు.

Read Also: Triptii Dimri: అవకాశాల్లేక కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఎన్నో: “యానిమల్” నటి

Show comments