NTV Telugu Site icon

Gudlavalleru Engineering College Incident: ఏపీలో తొలిసారిగా CERT సేవలు.. గుడ్లవల్లేరు కాలేజీ ఘటనపై తేల్చేసిన పోలీసులు..

Ig Ashok Kumar

Ig Ashok Kumar

Gudlavalleru Engineering College Incident: కృష్ణా జిల్లా గుడివాడలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల వ్యవహారం పెద్ద రచ్చ చేసింది.. విద్యార్థినుల హాస్టల్ వాష్ రూమ్‌లో హిడెన్ కెమెరాల ఆరోపణలు వచ్చాయి.. దీనిపై కాలేజీలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు విద్యార్థులు.. అయితే, ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. తొలిసారి సీఈఆర్‌టీ సేవలను ఉపయోగించి.. కొంత క్లారిటీకి వచ్చారు.. పోలీసు బృందాల దర్యాప్తు అప్డేట్స్ పై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.. కళాశాలలో పోలీసులు నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు గుర్తించలేదని ఆయన స్పష్టం చేశారు.. క్రిమినల్ కేసుల్లో ఏపీలో తొలిసారిగా ఢిల్లీకి చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ (CERT) సేవలు వినియోగించాం. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల అనుమానాలు నివృత్తి చేశాం.. కళాశాల వ్యవహారంపై ముగ్గురు ఐజీలు దర్యాప్తు చేశారు.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా పోలీసుల విచారణ జరిగిందన్నారు..

Read Also: Lucknow: కదులుతున్న అంబులెన్స్‌లో మహిళపై అత్యాచార యత్నం..

హాస్టల్ వాష్ రూమ్‌ల్లో కెమెరాలు ఏర్పాటు చేశారంటూ ఆరోపణలు వచ్చిన వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేశాం. విద్యార్థులు, స్త్రీ శిశు సంక్షేమ, పోలీసు బృందాల సమక్షంలో… ఆరోపణలు వచ్చిన వెంటనే హాస్టల్ వాష్ రూమ్‌ల్లో తనిఖీలు చేశాం అన్నారు ఐజీ అశోక్‌ కుమార్‌.. వాష్ రూమ్‌లు, షవర్లలో ఎటువంటి కెమెరాలు గుర్తించలేదని స్పష్టం చేశారు. విద్యార్థులు, హాస్టల్ సిబ్బంది, ఉద్యోగులు అందరినీ నేరుగా విచారించాం.. విచారణలో కెమెరాలు కానీ, ఆరోపిస్తున్న వీడియోలు కానీ ప్రత్యక్షంగా చూసినట్లు ఏ ఒక్కరు చెప్పలేదన్నారు.. కెమెరాల ఏర్పాటు, వీడియోలు అంశం ఎవరో చెబితేనే తమకు తెలిసిందని విచారణలో అందరూ చెప్పారని వెల్లడించారు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థుల ఫోన్లు, ల్యాప్ ట్యాప్ లను స్వాధీనం చేసుకున్నామన్నారు..

Read Also: SBI Donations: సీఎం సహాయనిధికి ఎస్‌బీఐ ఉద్యోగుల ఒకరోజు వేతనం విరాళం

ఇక, ఏపీలో క్రిమినల్ కేసుల్లో తొలిసారిగా CERT సేవలు వినియోగించాం.. వారు అన్ని విధాలుగా దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు ఐజీ అశోక్‌ కుమార్‌.. తాము స్వాధీనం చేసుకున్న 14 ఫోన్లు, 6 ల్యాప్ ట్యాప్‌లు, ఒక ట్యాబ్ ను CERT బృంద సభ్యులకు అప్పగించాం. విద్యార్థులు, తల్లి దండ్రులు విద్యార్థి సంఘాలు వ్యక్తం చేసిన అనుమానాలను నివృత్తి చేశాం. విద్యార్థులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు.. నేరుగా చేసిన దర్యాప్తులో ఎటువంటి స్పై కెమెరాలు లభ్యం కాలేదు.. ఢిల్లీ సంస్థ CERT టెక్నికల్ విచారణ జరుగుతుంది.. మరో మూడు రోజుల్లో ఆ నివేదిక కూడా వస్తుంది. ఈ ఘటనపై ఏటువంటి ఆధారాలున్న పోలీసుల దృష్టికి తేవచ్చు.. కళాశాల యజమానియానికి విద్యార్థుల భద్రతపై పలు సూచనలు చేశామని తెలిపారు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్.

Show comments