Deputy CM Pawan: మొంథా తుఫాన్ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంతో ప్రజలను అప్రమత్తం చేయడంతో చాలా వరకూ ప్రాణ నష్టాన్ని నివారించింది. అయితే, కొన్ని చోట్ల అకస్మాత్తుగా జరిగిన ఘటనలతో ఏపీవ్యాప్తంగా 7 చనిపోగా, ఒకరు గల్లంతయ్యారు. కాకినాడ, శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, నెల్లూరు, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో ఒక్కొక్కరు చనిపోయారు.
Read Also: Jailer 2 : ‘జైలర్ 2’లో మరో స్టార్ కమెడియన్ ఎంట్రీ – డబుల్ డోస్ కన్‌ఫర్మ్!
ఈ సందర్భంగా మొంథా తుఫాన్ ఎఫెక్ట్ తో తీవ్రంగా నష్టపోయిన కృష్ణా జిల్లాల్లో ఈరోజు (అక్టోబర్ 30న) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరులో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఆయన సందర్శించనున్నారు. వరద ప్రాంతాలను పరిశీలించి, బాధితులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించనున్నారు.
