NTV Telugu Site icon

CM Chandrababu Warning: భూకబ్జాలపై సీఎం సీరియస్‌.. తాట తీస్తా..!

Babu

Babu

CM Chandrababu Warning: భూకబ్జాలకు పాల్పడితే తాట తీస్తాం అని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కృష్ణా జిల్లా ఈడుపుగల్లులో రెవెన్యూ సదస్సుకు హాజరైన సీఎం చంద్రబాబు.. రైతుల నుంచి వినతులు స్వీకరించారు.. రెవెన్యూ సదస్సులో రెవెన్యూ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్, సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్, స్ధానిక ఎంఎల్ఏలు.. నేతలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. అత్యంత విధ్వంసం జరిగింది గత ప్రభుత్వంపై 1,51,467 అర్జీలు మా దగ్గరకు వచ్చాయి… అందులో 78,854 దరఖాస్తులు‌ ROR కోసం వచ్చాయి.. 8267 భూకబ్జాకు సంబంధించి వచ్చాయని వివరించారు.. ప్రజల జీవితాలు అంధకారంలోకి పంపే స్ధితిలోకి వచ్చారు దుర్మార్గులు అని మండిపడ్డారు.. మీ భూమి మీకు ఇప్పించాలనే బాధ్యత తీసుకున్నా.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి గత సీఎం గుమాస్తాలతో మీ భూమిపైన పెత్తనం చేశారు.. హైదరాబాదు లో ఉండే భూములలో అవకతవకలు ఉండచ్చు.. ఏపీ భూములలో అలాంటి అవకతవకలు లేవని స్పష్టం చేశారు..

Read Also: Priyanka Gandhi: ప్రియాంకకు 1984తో కూడిన బ్యాగ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన బీజేపీ.. తీసుకుని ఏం చేశారంటే..!

ఆ రాళ్ళ పైన ఫోటో తీయడానికి 12 కోట్లు ఖర్చయిందన్నారు సీఎం చంద్రబాబు.. సమస్యలకు పరిష్కారం చాలా పెద్ద పని.. సమస్యలు‌ సృష్టించడం తేలిక అన్నారు.. జనవరి 9వ తేదీ వరకూ రెవెన్యూ సదస్సులు జరుగుతాయి.. రెవెన్యూ సదస్సుల ద్వారా మీ ఆస్తి మీకిచ్చే బాధ్యత మాది అని మాట ఇచ్చారు.. 2024 ల్యాండ్ గ్రాబింగ్ చట్టం.. ద్వారా కబ్జాలు ఎలాంటివైనా కఠిన చర్యలుంటాయన్న ఆయన.. కబ్జా అని భూమి దగ్గరకి వెళ్తే జైలు కనిపించాలని పేర్కొన్నారు.. 6698 గ్రామాల్లో రీ సర్వే పై 2,79,149 మంది ఫిర్యాదు చేశారు.. ప్రతీ ఒక్క సమస్య మానవతా దృక్పధంతో పరిష్కరిస్తాం.. 176 ఇంటి స్ధలాలు 82-86లో ఇచ్చినవి 22ఏలో పెట్టి ఇబ్బంది పెట్టారు గత ప్రభుత్వం లో… ఆ 176 మందికి బే షరతుగా పట్టాలు ఇస్తాను అన్నారు.. ఐదు మంది కుటుంబ సమస్యతో మా దగ్గరకి వచ్చారు… వారి సమస్యను కలెక్టర్ తీరుస్తారని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..