NTV Telugu Site icon

Kadambari Jethwani: మరోమారు ఇబ్రహీంపట్నం పీఎస్‌కు సినీ నటి జత్వాని..

Kadambari Jethwani

Kadambari Jethwani

Kadambari Jethwani: ముంబై నటి జత్వాని కేసు సంచలనం సృష్టిస్తోంది.. ఇప్పటికే ఈ వ్యవహారంలో చర్యలకు కూడా దిగింది ప్రభుత్వం.. అయితే, మరోమారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు వచ్చారు సినీ నటి జత్వాని.. రాత్రి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారామె.. దీంతో.. ఈ రోజు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.. కాదంబరి జత్వాని నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించే పనిలో పడిపోయారు ఇబ్రహీంపట్నం సీఐ చంద్రశేఖర్.. మరోవైపు.. కేసు విచారణను వేగవంతం చేశారు.. గతంలో విజయవాడ వెస్ట్ ఏసీపీగా ఉన్న హనుమంతరావు, ఇబ్రహీంపట్నం సీఐ ముత్యాల సత్యనారాయణలను ఇప్పటికే సస్పెండ్‌ చేశారు పోలీసు ఉన్నతాధికారులు. అక్కడి ఆగకుండా మరి కొంత మంది అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది..

Read Also: DTH Signal Repair Trick: పదే పదే వర్షానికి మీ టీవీ సిగ్నల్ పోతుందా.. అయితే డిష్ ఇలా చేయండి

సినీనటి కాదంబరి జత్వాని.. కేసు కీలక మలుపు తీసుకుంది.. జత్వాని.. వాళ్ల తల్లిదండ్రులు, న్యాయవాదులతో కలిసి శుక్రవారం రాత్రి ఇబ్రహీంపట్నం పీఎస్‌కు వచ్చారు.. కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు విద్యాసాగర్, మరికొందరిపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనను గతంలో పోలీసు అధికారులు, వ్యక్తులు బంధించి వేధింపులకు గురి చేశారని చెబుతున్న ఆమె.. దానిపై సుమారు 2 గంటల పాటు సీఐకి వివరాలు వెల్లడించారు.. అయితే, ఈ కేసులో గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండడం కలకలం రేపుతోంది.. మరోవైపు.. కేసు దర్యాప్తు అధికారిగా ఏసీపీ స్రవంతి రాయ్ ను నియమించిన విషయం విదితమే.. ఇప్పటికే ఇద్దరు అధికారులపై వేటు పడిన నేపథ్యంలో.. తర్వాత ఎవరిపై చర్యలు తీసుకుంటారో అనే చర్చ ఆసక్తికరంగా సాగుతోంది.. మరోవైపు.. కొందరు అధికారుల్లో టెన్షన్‌ కూడా మొదలైంది..