భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల కోసం ఏపీ విచ్చేసిన ప్రధాని మోడీ.. హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకున్నారు.. ఆ తర్వాత గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి హెలికాప్టర్‌లో భీమవరం వెళ్తున్న సమయంలో.. హెలికాప్టర్‌కు సమీపంలో భారీగా నల్లబెలూన్లు ఎగరడం కలకలం రేపింది. ఈ ఘటనపై ఎస్పీజీ సీరియస్ అయినట్టు వార్తలు కూడా వచ్చాయి.. ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యమేనన్న ఎస్పీజీ.. బెలూన్ల తరహాలోనే డ్రోన్లని ఎగరేస్తే పరిస్థితేంటని మండిపడిందని.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్పీజీ నివేదిక కోరినట్టు తెలిసింది.. ఇక, ఈ ఘటనపై ఏపీ పోలీసులు క్లారిటీ ఇచ్చారు.
Read Also: Office Romance: ఆ ఇద్దరు అడ్డంగా బుక్.. వీడియో లీక్!
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో ఎలాంటి భద్రత వైఫల్యం లేదని స్పష్టం చేశారు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా.. నాలుగు కిలో మీటర్ల దూరంలో బెలూన్లు ఎగరవేశారని తెలిపారు.. అయితే, నోటితో గాలి ఊది బెలూన్లు ఎగరేశారని.. బెలూన్లల్లో ఎలాంటి హైడ్రోజన్ లేదని క్లారిటీ ఇచ్చారు.. సెక్యూర్టీ రిస్క్ లేనే లేదని తేల్చేశారు.. ఇక, ప్రధాని మోడీ పర్యటనలో చోటు చేసుకున్న ఈ పరిణామంపై ఎస్పీజీ మమ్మల్ని ఎలాంటి నివేదిక కోరలేదన్నారు జాషువా… అయితే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు బెలూన్లు ఎగరేశారని తెలిపిన ఆయన.. కాంగ్రెస్ పార్టీకి చెందిన పద్మశ్రీ, సావిత్రి, కిషోర్, రాజీవ్ రతన్ వంటి వారు ఈ ఘటనకు పాల్పడినట్టు దర్యాప్తులో తేలిందన్నారు.. నిబంధనల ప్రకారం వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా. కాగా, ప్రధాని పర్యటనలో బెలూన్ల వ్యవహారం పెద్ద రచ్చగా మారింది.