విజయదశమి పేరు చెప్పగానే విజయవాడ దుర్గమ్మ గుర్తుకువస్తుంది. దసరా అంతటా అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిమంది ప్రతిరోజూ బెజవాడకు తరలివస్తారు. అక్కడ ఏర్పాట్లు కూడా భారీగా జరుగుతాయి. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. దసరా ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. క్యూలైన్లను నేను స్వయంగా పరిశీలించానన్నారు. లడ్డూ ప్రసాదం నాణ్యత, రుచిపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
Read Also: Kottu Satyanarayana: శ్రీశైలంలో చౌల్ట్రీలపై దేవస్థానానిదే అజమాయిషీ
తిరుపతి లడ్డూ మాదిరి ప్రసాదం ఉందని భక్తులు చెబుతున్నారు. నివేదన సమయంలో భక్తులు సహకరించాలన్నారు. భక్తులు సంతృప్తి పడితే దుర్గమ్మ తల్లి సంతోషపడుతుంది. సీఎం సారధ్యంలో సమస్యలు లేకుండా ఉత్సవాలను నిర్వహించగలుగుతున్నాం. రేపు శుక్రవారం కావడంతో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. రేపటి రద్ధీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించాం. శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాం అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. భక్తులు, సిబ్బంది పట్ల సంయమనంతో వ్యవహరించమని పోలీసులకు సూచించాం అన్నారు.
ఉభయ దాతలకు మహామండపం ఆరవ అంతస్తులో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఉభయ దాతలకు అంతరాలయ దర్శనం కల్పించే విషయమై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తాం. అధికారులతో మరోమారు చర్చించి నిర్ణయం తీసుకుంటాం అన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ.
Read Also: Uttam Kumar Reddy : భూములు అన్యాక్రాంతం అవుతుంటే అధికారులు స్పందించడం లేదు