Kotamreddy Sridhar Reddy Reacts On YCP Suspension: తనను వైసీపీ నుంచి సస్పెండ్ చేయడంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాజాగా స్పందించారు. తన సస్పెన్షన్‌ను స్వాగతిస్తున్నానని అన్నారు. తాను రెండు నెలల ముందే వైసీపీకి దూరంగా ఉన్నానని చెప్పారు. కానీ.. ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం సరికాదని పేర్కొన్నారు. వైఎస్ కుటుంబానికి వీర విధేయులుగా ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలను వైసీపీ నుండి సస్పెండ్ చేయడంపై ముఖ్యమంత్రి జగనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కోట్ల రూపాయలు తీసుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఆరోపణలు సరికావని తిప్పికొట్టారు. టీడీపీలో గెలిచి వైసీపీకి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలకు ఎన్ని కోట్లు ఇచ్చారు సజ్జల స్పష్టం చేయాలని కోరారు. పార్టీ అధిష్టానం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందని జోస్యం చెప్పారు.
S Jaishankar: ఖలిస్తానీవాదుల దాడి.. యూకేకు గట్టిగా ఇచ్చిపడేసిన జైశంకర్..
కాగా.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్ వ్యవహారం రచ్చ రేపింది. ఈ క్రాస్ ఓటింగ్‌ను సీరియస్‌గా తీసుకున్న వైసీపీ హైకమాండ్.. అంతర్గతంగా దర్యాప్తు చేసి నలుగురు ఎమ్మెల్యేలని గుర్తించింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నేపథ్యంలోనే కోటంరెడ్డి ఘాటుగా బదులిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనని వైసీపీ గానీ, టీడీపీ గానీ ఓటు అడగలేదని.. ఆత్మప్రబోధానుసారం ఓటు వేస్తానని చెప్పి ఓటు వేశానన్నారు. చేతిలో అధికారం ఉందని సస్పెండ్ చేశారని మండిపడ్డారు. షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, పార్టీలో పెత్తందారీ విధానం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తానెక్కడా తప్పు చేయలేదని, సస్పెండ్ చేసినందుకు సంతోషంగా ఉందని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తనకు పదవులు ముఖ్యం కాదని, విలువలే ముఖ్యమంటూ ఈ సందర్భంగా ఉండవల్లి శ్రీదేవి చెప్పుకొచ్చారు.
Viral: ఓ తాతో నువ్వు ఈ వయసులోనే ఇలా ఉంటే.. మరి ఆ వయసులో..