మంగళగిరిలో జనసేన విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. సమావేశంలో పాల్గొన్న జనసేన పీఏసీ సభ్యుడు కొణిదెల నాగబాబు మాజీ మంత్రి అవంతిపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైజాగ్ రుషి కొండ వ్యూ చాలా అద్భుతమైనది. రుషి కొండను కొట్టేస్తుంటే ప్రతిఘటించింది జనసేనే. అవంతి శ్రీనివాస్ ఎర్ర కొండలు తినేస్తున్నాడు.ఈ పాటికే ఒక కొండ తినేసి ఉండుంటాడు. పవన్ చెప్పింది వింటే.. మన అధ్యక్షుణ్ని 2024లో సీఎంగా చూడవచ్చన్నారు నాగబాబు.
పవన్ ఎక్కడికైనా వెళితే సమస్య తీరుతుందని నమ్మకం ఏర్పడింది. ఉత్తరాంధ్రలో సమస్య వస్తే పవన్ అవసరం లేదు.. జన సైనికులు వస్తే చాలని భావించేంతలా నమ్మకం ఏర్పడింది. నాయకులు పని చేయకపోతే చేయి మెలిపెట్టి ప్రశ్నించే స్ధాయికి కేడర్ ఎదిగారు.సమస్య వచ్చినప్పుడు గుర్తొచ్చే నాయకుడు పవన్ కల్యాణ్.
ఉత్తరాంధ్రలో లీడర్ షిప్ సమస్య ఉంది.అక్రమ మైనింగ్, ఇసుక తవ్వకాలపై జనసైనికులు పోరాట ప్రతిమ అమోఘం.జనసేనకు నేనేం చేస్తున్నానని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.వైసీపీలో లంచగొండితనం సింగిల్ విండోలా మారిపోయింది.పవన్ నిప్పుల్లో దూకమంటే దూకాలి..అలాంటి కార్యకర్త అవసరం అన్నారు నాగబాబు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, కోనసీమ అల్లర్లు, జనసేనపై ఆరోపణలు, భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చ సాగుతోంది.
