2024 ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నేతలు సమన్వయంతో పనిచేయాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారన్నారు మాజీ మంత్రి కొడాలినాలి. గ్రాఫ్ తక్కువగా ఉన్న ఎమ్మెల్యేలు మరింత పనిచేయాలని సూచించారన్నారు. గ్రాఫ్ పెంచుకోకపోతే… వారిని పక్కనపెట్టే అవకాశం కూడా ఉందని చెప్పారాయన. ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే ఉండదన్నారు. విభేదాలు విడనాడి అందరూ కలసి పనిచేయాలని ఆదేశించిన ఆయనచారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చేలా కష్టపడి పనిచేయాలని సీఎం చెప్పారన్నారు. సీఎం జగన్ అధ్యక్షతన మంత్రులు, పార్టీ అధ్యక్షులతో జరిగిన సమావేశం ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Read Also: YS Jagan: గేర్ మారుస్తున్నాం.. 175 సీట్లకు 175 ఎందుకు రాకూడదు..?
పవన్ కల్యాణ్ జెండా, ఎజెండా వేరు అని ఆరోపించారు కొడాలి నాని.. పవన్ కల్యాణ్ కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నాడు అంటూ ఫైర్ అయిన ఆయన.. చంద్రబాబు ఎట్టి పరిస్ధితుల్లో అధికారంలోకి రాడు అంటూ జోస్యం చెప్పారు. ఇక, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవు. 2024లోనే రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయి. ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం జగన్ సర్వేలు చేయించుకున్నారు. 65 శాతం ప్రజలు సీఎం జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావాలని సర్వేల్లో తేలిందని.. సర్వేల్లో కొంత మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గిందన్నారు.. కొందరు ఎమ్మెల్యేల గ్రాప్ 50 నుంచి 40 శాతం మాత్రమే ఉందని చెప్పారు. ఎమ్మెల్యేలు పనితీరు మెరుగు పరచుకోవాల్సిన అవసరం ఉందని సీఎం ఆదేశించారని వెల్లడించారు కొడాలి నాని. ఇక, తనను సీఎం ఎందుకు పక్కన పెట్టారనే విషయంపై కూడా తనదైన శైలిలో స్పందించిన కొడాలి.. ఏ మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..
