NTV Telugu Site icon

Kodali Nani: కోటంరెడ్డి వ్యవహారంలో కొడాలి సంచలన వ్యాఖ్యలు.. పకోడిగాళ్ల గురించి పట్టించుకోం..!

Kodali

Kodali

Kodali Nani:నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కాకరేపుతోన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఇతరులందరివీ కలిపి వెయ్యి ఫోన్లు ఉంటాయి.. అవన్నీ ఎవడు వింటాడు? అని ప్రశ్నించారు.. పార్టీ మారాలనుకున్నాడు.. ఇక్కడ మంత్రి పదవి అడిగితే ఇవ్వలేదు.. చంద్రబాబు ఇస్తానన్నాడేమో వెళ్లాడు అంటూ కోటంరెడ్డిపై ఆరోపణలు గుప్పించారు. పెగాసెస్ అలాంటి వన్నీ చంద్రబాబుకు అలవాటు.. మాలాంటి వాళ్లు జగన్ వలనే ఎమ్మెల్యేలం అయ్యాం అని కోటంరెడ్డే చాలా సార్లు చెప్పారని గుర్తుచేశారు.. ఒకే కులానికి పదవులు ఇవ్వాలంటే కుదరదు.. కానీ, జగనేమో అన్ని కులాలకూ ఇవ్వాలని చూశాడు.. పిన్నెల్లి, శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్లు చాలా మంది ఉన్నారు కదా? నిలదీశారు.

Read Also: Cycling: సైక్లింగ్‌తో క్యాన్సర్ దూరమవుతుందా? నిజమెంత?

నన్ను పదవి నుండి తప్పుకోమన్నాడు… తప్పుకున్నాను.. బాలినేనికి అలాగే చెప్పారు.. ఆయన అర్థం చేసుకున్నారని తెలిపారు కొడాలి.. కానీ, పదవులు కావాలని వెళ్లేవారే ఇలాంటి ట్యాపింగ్ ఆరోపణలు చేస్తారని మండిపడ్డారు. గతంలో 23 మంది పకోడిగాళ్లు టీడీపీలోకి వెళ్లారు.. వారిలో ఒకరే గెలిచారన్న ఆయన.. ఇలాంటి వాళ్లంతా వెళ్లిపోతేనే పార్టీ బాగుపడుతుందన్నారు. చంద్రబాబులా ఒకే కులానికి పదవులు అంటే కుదరదు అన్నారు. అసలు, ఫోన్ ట్యాపింగ్ ఎవరికి అవసరం? ఇంటెలిజెన్స్ డీజీకి ఏవైనా మెసేజ్ వస్తే మాకు పంపుతారు. అది సహజమే.. మా దృష్టికి వచ్చిన వాటిని కూడా అధికారులకు పంపుతుంటాం.. అందరం ప్రభుత్వంలో భాగం.. కానీ, వెళ్లేవారు వెళ్లినా జగన్ పట్టించుకోరు.. కోటంరెడ్డి లాంటి పకోడిగాళ్ల గురించి ఆలోచించాల్సిన పని లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, వైజాగ్ రాజధాని అని జగన్ సీఎం అయినప్పటి నుండి చెప్తూనే ఉన్నారు.. ఇప్పుడు సీఎం కొత్తగా చెప్పిన విషయం ఏముంది? అని ఎదురు ప్రశ్నించారు. రాజధాని విషయంలో కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని కోర్టు చెబితే కేంద్రం పై ఒత్తిడి తీసుకొస్తాం అన్నారు.. 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు వస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజాభిష్టాన్ని అంగీకరించాల్సిందేనన్నారు మాజీ మంత్రి కొడాలి నాని.

Show comments