Kodali Nani vs Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓపెన్ చాలెంజ్ విసిరారు.. మాజీ మంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని.. గన్నవరంలో చంద్రబాబు పర్యటన, అక్కడ బాబు చేసిన కామెంట్లపై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు కొడాలి నాని.. నేను, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వస్తాం.. కొట్టుకుందాం.. నువ్వు రెడీనా బాబు? అని సవాల్ చేశారు.. అసెంబ్లీకి రాజీనామా చేసి వస్తాం.. ఎక్కడైనా ముగ్గురం కలిసి కొట్టుకుందాం.. చత్తీస్‌గఢ్, ఒడిశా అడవుల్లో కొట్టుకుందామా? ఎక్కడ కొట్టుకుందాం? చెప్పు.. కొట్టుకొని పైకి పోదామా? జైల్ కు పోదామా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చే శారు.. ఇక, వంశీ పశువుల డాక్టర్ కోర్సు చదివాడు.. పశువుల డాక్టర్ నోరు లేని ప్రాణాలకు జీవం పోస్తాడు.. కానీ, చంద్రబాబు ఆ పశువుల పాలు, పెరుగు అమ్ముకుంటాడు.. పశువుల డాక్టర్ బెటరా? పాలు అమ్ముకునే 420 బెటరా? అంటూ ప్రశ్నించారు.. గన్నవరానికి పట్టాభిని పంపింది చంద్రబాబేనని విమర్శించారు కొడాలి నాని.
Read Also: Kodali Nani: బాబు మైండ్ ఉండి మాట్లాడుతున్నాడా..? బాలయ్య సినిమాలు చూసి పిచ్చెక్కిందా..?
ఇక, వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసిన గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని ఈ రోజు చంద్రబాబు సందర్శించారు. తగలబెట్టిన కార్లను పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీ నేతలు, పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఒకరు బెదిరిస్తే పారిపోయే పార్టీ టీడీపీ కాదని చంద్రబాబు అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించేవాళ్లమని చెప్పారు. తాను వద్దనుకుంటే రాజశేఖరరెడ్డి, జగన్ పాదయాత్రలు చేసేవారా? అని ప్రశ్నించారు. దొంగదెబ్బ తీయాలనుకోవడం కాదని… దమ్ముంటే నేరుగా ఢీకొనాలని, ఎంత మంది వస్తారో రావాలని సవాల్ విసిరారు చంద్రబాబు.. సైకో పాలనలో ప్రజల ప్రాణాలకు, మహిళల మానాలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. వ్యవస్థలకు పట్టిన చీడపురుగులను వదిలించాల్సి ఉందని… వైసీపీ అరాచకాలను ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని, అందరూ తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు.. దమ్ముంటే రండి.. పోలీసులు లేకుండా రండీ అని సవాల్ విసిరారు.. అయితే, బాబు సవాల్‌పై అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు కొడాలి నాని.. నేను, వంశీ కలిసి వస్తాం.. ఎక్కడైనా కొట్టుకుందాం.. నువ్వు బ్లాక్ గాడ్స్‌ని పక్కని పెట్టిరా? అంటూ సవాల్ చేశారు.. మొత్తంగా.. గన్నవరం పాలిటిక్స్ ఇప్పుడు ఏపీలో కాకరేపుతున్నాయి.